Begin typing your search above and press return to search.
ఛారిత్రాత్మక తాజ్ లో స్టార్ కపుల్ రిసెప్షన్
By: Tupaki Desk | 11 April 2022 6:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు హీరోయిన్ ఆలియా భట్ ల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు దారి తీసింది. ఇద్దరి కుటుంబ సభ్యుల ఒప్పందంతో వీరిద్దరు ఏప్రిల్ 14వ తారీకున ఒక్కటి కాబోతున్న విషయం తెల్సిందే. గత రెండు మూడు సంవత్సరాలుగా వీరిద్దరి వివాహం గురించి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు వీరి వివాహం జరుగబోతుంది.
పెళ్లి హడావిడి మొదలు అయ్యింది. బాలీవుడ్ ప్రముఖులు మరియు సెలబ్రెటీలు అంతా కూడా ఈ పెళ్లి వేడుకలో ప్రథాన గెస్ట్ లుగా ఉండబోతున్నారు. ప్రముఖులకు ఇప్పటికే ఈ జోడీ ఆహ్వానం అందించారు. పెళ్లికి లిమిటెడ్ గా ఆహ్వానాలు అందించిన ఈ జంట రిసెప్షన్ కు మాత్రం ఎక్కువ మందిని ఆహ్వానించినట్లుగా బాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఆలియా.. రణబీర్ ల పెళ్లి రిసెప్షన్ ను ఛారిత్రాత్మక తాజ్ మహల్ హోటల్ లో నిర్వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా మీడియాకు వెళ్లడించలేదు కాని లీక్ ఇచ్చారని తెలుస్తోంది. ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు కలిసి ఏప్రిల్ 17వ తారీకున ఛారిత్రాత్మక తాజ్ మహల్ హోటల్ లో ఈ వింధు ను ఏర్పాటు చేశారట.
కొన్ని సంవత్సరాల క్రితం తాజ్ మహల్ హోటల్ పై టెర్రరిస్ట్ ల దాడి నేపథ్యంలో వార్తల్లో నిలిచిన ఆ హోటల్ మళ్లీ వీరి పెళ్లి రిసెప్షన్ తో హడావుడి అక్కడ కనిపించబోతుంది. భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలోనే రిసెప్షన్ ను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఆలియా మరియు రణబీర్ కపూర్ లు దాదాపుగా నాలుగు అయిదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. గతంలో రణబీర్ కపూర్ ఇతరులతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని పెళ్ల వరకు మాత్రం ఆ రిలేషన్ వెళ్లలేదు. ఆలియాతో ఆయన రిలేషన్ సుదీర్ఘ కాలంగా కొనసాగాలంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియా త్వరలో మరో స్టార్ హీరో సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక హిందీలో ఈమె జోరు తగ్గేదే లేదు అన్నట్లుగా సాగుతోంది.
ఇటీవలే గంగూబాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మాస్త్ర సినిమా లో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా చాలా సినిమాల్లో ఈమె నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగే ఉద్దేశ్యంతోనే ఈ అమ్మడు ఉంది.