Begin typing your search above and press return to search.

ఆలియా పెళ్లి హడావుడి.. డ్రస్‌ డిజైనర్స్ వీళ్లే

By:  Tupaki Desk   |   7 April 2022 9:00 AM IST
ఆలియా పెళ్లి హడావుడి.. డ్రస్‌ డిజైనర్స్ వీళ్లే
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్ ఆలియా భట్ పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. గత కొన్నాళ్లుగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యింది అనే విషయం తెల్సిందే. ఇదే నెలలో అది కూడా ఈనెల 17వ తారీకున ఆలియా భట్‌ పెళ్లి జరుగబోతుంది. ప్రియుడు రణబీర్‌ కపూర్‌ తో ఈనెల 17న ఆలియా భట్‌ ఒక్కటి కాబోతున్న నేపథ్యంలో హడావుడి ఓ రేంజ్ లో ఉంది.

సెలబ్రెటీల పెళ్లి అంటే ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్స్ పెళ్లి అంటే ఖచ్చితంగా వారు ఏం డ్రస్ లు వేసుకున్నారు.. పెళ్లి సమయంలో ఏ డ్రస్ లో ఉన్నారు.. పెళ్లి తర్వాత రిసెప్షన్‌ కు ఏం డ్రస్ వేసుకున్నారు.. అంతకు ముందు ఏం వేసుకున్నారు.. ఇలా రకరకాలుగా సెలబ్రెటీల పెళ్లి గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. లక్షల ఖరీదైన డ్రస్ లను సెలబ్రెటీలు పెళ్లికి ధరించడం చాలా కామన్‌ విషయం.

ప్రియాంక చోప్రా... దీపిక పదుకునే ఇంకా పలువురు స్టార్స్ కూడా తమ పెళ్లికి అత్యంత ఖరీదైన ఔట్ ఫిట్ తో కనిపించారు. పెళ్లి సమయంలో వారు జనాల కళ్లలో మెరుపు కనిపించేంతగా ఖరీదైన డ్రస్‌ లు ధరిస్తూ ఉంటారు. ఆలియా భట్ కూడా వారికి ఏమాత్రం తీసి పోకుండా అత్యంత ఖరీదైన డిజైనర్ వేర్‌ ను తన పెళ్లికి ధరించి ప్రియుడు.. కాబోయే భర్త రణబీర్ పక్కన నిల్చునేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అందరు స్టార్‌ సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ ను డిజైన్‌ చేసే మనీష్ మల్హోత్రా మరియు సబ్యసాచి లు ఆలియా పెళ్లికి డిజైనర్‌ డ్రస్ లను డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా వారు ఆ పనిలోనే ఉన్నారని సమాచారం అందుతోంది. పదుల కొద్ది డిజైన్ లు తయారు చేసి.. మోడల్స్ విషయం లో.. క్లాత్‌ విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.

ఆలియా భట్‌ బాలీవుడ్‌ లోనే టాప్‌ స్టార్‌ హీరోయిన్ అనడంలో సందేహం లేదు. అందుకే ఆమె పెళ్లికి అంతకు మించి అన్నట్లుగా వారిద్దరు కూడా చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆలియా పెళ్లికి వేసుకోబోతున్న లెహంగా కోసం సుదీర్ఘం గా కష్టపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ లెహంగా కోసం ఏకంగా లక్షల కు లక్షలు కూడా ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఆలియా పెళ్లికి ఆహ్వానించాల్సిన సెలబ్రెటీల జాబిత రెడీ అయ్యింది. అందులో తెలుగు సెలబ్రెటీలు స్టార్స్ ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.

ఆలియా మొదటి సారి తెలుగు లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ హిట్ అయ్యింది.. ఆమె పాత్రకు గుర్తింపు దక్కింది కాని సిత పాత్ర ను ఇంకాస్త సమయం ఉంచితే బాగుండేది.. ఆమె స్క్రీన్‌ స్పేస్‌ విషయంలో జక్కన్న మరీ ఇంత పిసినారిగా వ్యవహరించకుండా ఉండాల్సిందంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.