Begin typing your search above and press return to search.

వీడియో: ఏం పాడావ‌మ్మా ఆలియా?

By:  Tupaki Desk   |   7 March 2019 7:03 AM GMT
వీడియో: ఏం పాడావ‌మ్మా ఆలియా?
X
బాలీవుడ్ క్రేజీ గాళ్‌ ఆలియా పాడితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ముంబై ప‌రిశ్ర‌మ‌లో క్రేజీ హీరోయిన్‌ గా అగ్ర‌తాంబూలం అందుకున్న ఆలియా భ‌ట్ వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు క‌థానాయిక‌గా రాణిస్తూనే ఇలా గాయ‌నిగానూ వేడెక్కించేస్తోంది. ఇటీవ‌లే ఓ మీడియా ఇంట‌రాక్ష‌న్ లో పాట‌ పాడాల్సిందిగా అభిమానులు కోరితే.. కాద‌న‌కుండా ఇలా పాట పాడి అంద‌రినీ సంతుష్టుల్ని చేసింది. ఆలియా సింగింగ్ స్టైల్ వీక్షించాక ``నీలో ఉందిలే పాట‌గ‌త్తె డార్లింగ్`` అంటూ యూత్ ఒక‌టే గుస‌గుస‌లాడేసుకోవ‌డం ఇంట్రెస్టింగ్.

ఆలియా పేరు విన‌గానే.. స్టార్ ఫిలింమేక‌ర్ మ‌హేష్ భ‌ట్ గుర్తుకు వస్తారు. అలాగే ప్ర‌స్తుతం బోయ్‌ఫ్రెండ్ ర‌ణ‌బీర్ క‌పూర్ స్ఫుర‌ణ‌కు రావాల్సిందే. ర‌ణ‌బీర్ ని ఆలియా పెళ్లాడ‌బోతోంద‌ని, అందుకు డాడ్ మ‌హేష్ భ‌ట్ ఓకే చెప్పార‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. ఇక ఓ ఇంట‌ర్వ్యూలో ఈ యంగ్ బ్యూటీ నెప్టోయిజంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే క్వీన్ కంగ‌న .. న‌ట‌వార‌సురాలైన ఆలియాపై విమ‌ర్శ‌ల‌తో బుల్లెట్ల వ‌ర్షం కురిపిస్తోంది. అందుకు ఆలియా ఝ‌డిసిందో ఏమో కానీ నెప్టోయిజం అన్న పాయింట్ గురించి ఎంతో సాఫ్ట్ గా మాట్లాడింది.

నట‌వార‌స‌త్వం అన్న‌ది అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఉంది. సినీరంగంలోనూ అది అతీతం కాదు. అయితే న‌ట‌వార‌సురాలు అయినంత మాత్రాన జ‌నం ఆద‌రించేయ‌రు. ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తేనే ఇక్క‌డ న‌టిగా రాణించ‌గ‌ల‌రు. మ‌నం న‌ట‌వార‌సుల‌మా? లేక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చామా? అన్న‌ది జ‌నాల‌కు తెర‌పై చూస్తున్నంత సేపూ గుర్తుకు రాదు. న‌టి జ‌నాల‌కు క‌నెక్ట‌వ్వాలి. అప్పుడే గుర్తిస్తారు.. అంటూ తెలివైన ఆన్స‌ర్ ఇచ్చింది. న‌ట‌వార‌సురాలిగా సినీ ఆరంగేట్రం చేసినా ఎంతో శ్ర‌మిస్తేనే త‌న‌కు ఈ స్థానం ద‌క్కింద‌ని ఆలియా ప‌దే ప‌దే ఆ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఆలియా ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న `బ్ర‌హ్మాస్త్ర‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇటీవ‌లే రిలీజైన `గ‌ల్లీ బోయ్‌`తో బంప‌ర్ హిట్ అందుకుంది ఈ యంగ్ క్రేజీ గాళ్‌. ఈ చిత్రంలో స‌ఫీనా పాత్ర‌తో గుండెలు దోచింది. రాజీ త‌ర్వాత మ‌రో బెస్ట్ పెర్ఫామెన్స్ తో ఆలియా క‌ట్టి ప‌డేసింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక ఈ బ్యూటీ ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రానికి క‌మిటైంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.