Begin typing your search above and press return to search.

అలియా ఎవరే అతగాడు

By:  Tupaki Desk   |   8 Jun 2018 3:22 PM IST
అలియా ఎవరే అతగాడు
X
రెగ్యులర్ హీరోయిన్స్ చేసే గ్లామర్ పాత్రలు కాకుండా తనలో నటికి ఛాలెంజ్ విసిరే సినిమాలు ఏరికోరి మరీ చేస్తున్న అలియా భట్ ఇటీవలే వచ్చిన రాజీ సక్సెస్ తో గాల్లో తేలుతోంది . విభిన్నమైన కాన్సెప్ట్ తో తాను గతంలో చేసిన హై వే-ఉడ్తా పంజాబ్ లను మించి ఇది వసూళ్లు దక్కించుకోవడంతో అలియా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరో లేకుండా సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించిన అలియా నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంశలు అందాయి. ఈ మధ్యే రన్బీర్ కపూర్ తో అలియా డేటింగ్ లో ఉండనే వార్త బాలీవుడ్ లో బాగా గుప్పుమంటోంది. దానికి ఊతమిస్తూ ఇద్దరు కలిసి చనువుగా కనిపించిన సందర్భాలను ఉదహరిస్తూ పలు వార్త కథనాలు కూడా వచ్చాయి. ఇంతవరకు ఇద్దరు జంటగా ఏ సినిమాలోనూ నటించకపోయినా ఈ ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు. కపూర్ ఫామిలీ భట్ కుటుంబంతో వియ్యం అందుతుందా అనే దాని మీద కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి.

మరోవైపు అలియా భట్ తన పెళ్లి ఖచ్చితంగా 30 ఏళ్ళ లోపే అవుతుందని బల్ల గుద్ది చెబుతోంది. మరి పెళ్లి కొడుకు ఎవరు అంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కండి అని మాట దాటవేస్తోంది. 30 లోపే చేసుకుంటాను అని నొక్కి వక్కాణించడం చూస్తే ఇతర హీరోయిన్ల మాదిరి 35-40లలో చేసుకునే ఉద్దేశం తనకు లేదని చెప్పినట్టే. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్ లో అనుష్క శర్మ ఒక్కర్తే ఉంది. విరాట్ ను మనువాడే సమయానికి తన వయసు 29. సో అలియా పెళ్లి రన్వీర్ కపూర్ తోనా లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ తో అలియా యమా బిజీగా ఉంది. జీరో-గల్లి బాయ్-కళంక్-బ్రహ్మత్స్ర షూటింగ్స్ లో ఊపిరిసలపని బిజీలో ఉంది. మరోవైపు రన్బీర్ కపూర్ సంజు విడుదల కోసం కళ్ళలో కోటి వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాడు. అలియా ఖాతాలో రాజీ పడింది కాబట్టి తనకూ సంజు అంతకు మించి హిట్ అవ్వాలని కోరుతున్నాడు. ట్రైలర్ చూస్తుంటే అదే నిజమయ్యేలా ఉంది. కాకతాళీయంగా రెండూ బయో పిక్ లే కావడం విశేషం