Begin typing your search above and press return to search.

#RRR బ్యూటీ కలలకు అంతు లేకుండా ఉందే

By:  Tupaki Desk   |   4 Feb 2020 10:29 AM GMT
#RRR బ్యూటీ కలలకు అంతు లేకుండా ఉందే
X
ప్రస్తుతం బాలీవుడ్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌ లో ఆలియా భట్‌ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్న కారణంగానే ఆలియా ఏకంగా 2019 ఫోర్బ్స్‌ జాబితాలో చేరిన విషయం తెల్సిందే. అత్యధిక సంపాదన కలిగిన బాలీవుడ్‌ స్టార్స్‌ జాబితాలో ఆమె నిలిచింది. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో కూడా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా ఈమె తన డ్రీమ్స్‌ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది. సహజంగా విలాసాలకు చాలా దూరంగా ఉండాలనుకునే ఆలియా ఇల్లు విషయంలో మాత్రం చాలా లావిష్‌ కోరికను కలిగి ఉందట. ఇప్పటికే లండన్‌ లోని ప్రముఖ ప్రాంతంలో చాలా ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన ఆలియా భట్‌ ఇప్పుడు తన డ్రీమ్‌ హౌస్‌ గురించి చెప్పుకొచ్చింది. పర్వతాల మద్యలో అత్యంత ప్రశాంతమైన వాతావరణం లో తన ఇల్లు ఉండాలనుకుంటున్నట్లుగా ఆలియా చెప్పుకొచ్చింది.

పర్వతాల మద్య ఇల్లు అంటే మామూలు విషయం కాదు. ఇల్లు విషయం లోనే కాకుండా ఈమె ఒక ప్రైవేట్‌ లగ్జరీ జెట్‌ విమానం కూడా కొనుగోలు చేయాలని కల కంటుందట. తనకు మాత్రమే ఉపయోగపడే లగ్జరీ ప్రైవేట్‌ జెట్‌ విమానం కొనాలనేది తన కల అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు అంతా అవాక్కవుతున్నారు. బాబోయ్‌ విమానం కొనుక్కోవాలని ఒక హీరోయిన్‌ కల కనడం గొప్ప విషయం. ఏ హీరోయిన్‌ కూడా ఇంత రిచ్‌ గా కలగనక పోవచ్చు అంటున్నారు.

కల కనడం తప్పు లేదు. దాన్ని నిజం చేసుకునేందుకు మరింతగా కష్టపడు అంటూ ఆలియాకు అభిమానులు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. కొందరు మాత్రం ఆలియా కలలకు అంతు పొంతు లేకుండా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.