Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆలియా.. గుండెల్లో చ‌లి..యా

By:  Tupaki Desk   |   22 Oct 2015 7:30 AM GMT
ఫోటో స్టోరి: ఆలియా.. గుండెల్లో చ‌లి..యా
X
అల‌నాటి మేటి క్లాసిక్‌ రొమాంటిక్‌ పాటలను మ‌రోసారి గుర్తు చేసుకోవాల్సిందే ఈ పిక్ చూస్తూ. ఉత్త‌రాది యువ‌త‌రం కంటిమీద కునుకే లేకుండా ఇన్‌ సోమ్నియా భారిన ప‌డ‌డానికి ఈ అమ్మ‌డే కార‌ణం అంటే అతిశ‌యోక్తి కాదు.

ఓ వైపు సోనాక్షి - సోన‌మ్ - శ్ర‌ద్ధా క‌పూర్ లాంటి నాయిక‌లు యువ‌త‌రం గుండెల్లో నిదుర‌పోతుంటే .. వీళ్లంద‌రికీ నేనేమీ త‌క్కువ కాను ..అని నిరూపిస్తోంది ఆలియాభ‌ట్‌. భ‌ట్స్ క్యాంపు నుంచి సినీనాయిక‌గా ఆరంగేట్రం చేసినా త‌న‌దైన ట్యాలెంటుతో తారాలోకంలోకి దూసుకుపోతోంది. క్యూట్ అప్పియ‌రెన్స్‌ - హాట్ అప్పీల్‌ తో అద‌ర‌హో అంటూ దూసుకుపోతోంది. ఇదిగో ఈ లేటెస్ట్ ఫోటో షూట్ అదిరిపోయింది క‌దూ? లేలేత లౌజులు.. కాటుక క‌నులు .. లేవ‌ర్ణం ర‌వికె - డిజైన‌ర్ గౌను.. ఈ రూపం చూస్తుంటే అప్పుడే కొల‌ను అడుగు నుంచి పైకి తేలి సూర్యోద‌యానికి వెల్‌ క‌మ్ చెబుతున్న క‌లువ‌లా క‌నిపిస్తోంది క‌దూ..!

అస‌లు బుట్ట‌బొమ్మ‌ - కేక‌లు పెట్టించే బూచమ్మ అని వ‌ర్ణించినా త‌ప్పేం లేదు. అస‌లు ఇలాంటి ఫోటోల‌తో కుర్రాళ్ల హృదయంపై మీద విరుచుకుప‌డ‌డం ఏం న్యాయం? నోబ్లెసీ మ్యాగజైన్‌ కోసం అమ్మడు ఇలా ఫోజులిచ్చింది.