Begin typing your search above and press return to search.

మాల్దీవ్స్ నుంచి మతి పోగొట్టేస్తోంది!!

By:  Tupaki Desk   |   15 Dec 2016 1:00 AM IST
మాల్దీవ్స్ నుంచి మతి పోగొట్టేస్తోంది!!
X
ఆలియా భట్ కి ఏడాది సూపర్ గా కలిసొచ్చేసింది. ఈ కుర్రది నటించిన అన్ని సినిమాలు కలెక్షన్స్ కుమ్మేశాయి. కపూర్ అండ్ సన్స్.. ఉడ్తా పంజాబ్.. రీసెంట్ గా డియర్ జిందగీ చిత్రాలతో మంచి సక్సెస్ లను సాధించిన ఆలియా ఫుల్ ఖుషీగా ఉంది.

ప్రస్తుతం ఈ ఎంజాయ్మెంట్ ని మాల్దీవ్స్ కి షిఫ్ట్ చేసిన ఆలియా భట్.. అక్కడ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉంది. తండ్రి మహేష్ భట్.. తల్లి సోని రాజ్దాన్.. సోదరి షహీన్ భట్ లతో కలిసి.. మాల్దీవ్స్ వెళ్లిన ఈ చక్కని చిన్నది అక్కడి నుంచి బోలెడన్ని బీచ్ ఫోటోలను అభిమానులకు పంచుతోంది. ఆలియా సిస్టర్ షహీన్ కూడా మాంచి టేస్ట్ ఉన్న వ్యక్తి కావడంతో.. రకరకాల యాంగిల్స్ నుంచి తీసిన పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. వీరి ఫ్యామిలీ వెకేషన్ సంగతులతో పాటు.. జలకన్యలా ఆలియా జలకాలాడుతున్న ఫోటోలు కూడా వీటిలో ఉన్నాయి.

అలలపై తేలుతోందా.. ఆనందంతో గాల్లో తేలుతోందా అనే రేంజ్ లో అమ్మడు అదరగొట్టేస్తోంది. ఇక ఆలియా రాబోయే చిత్రాల విషయానికి వస్తే.. వరుణ్ ధావన్ తో కలిసి బద్రీనాథ్ కి దుల్హనియా(హంప్టీ శర్మ కి దుల్హనియా సీక్వెల్)తో పాటు రణబీర్ కపూర్ కి జోడీగా సూపర్ హీరో మూవీ డ్రాగన్ లో కూడా నటించేయనుంది ఆలియా భట్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/