Begin typing your search above and press return to search.

టోన్డ్ బాడీతో కిల్ చేస్తున్న RRR సీత‌

By:  Tupaki Desk   |   17 July 2021 11:00 PM IST
టోన్డ్ బాడీతో కిల్ చేస్తున్న RRR సీత‌
X
2021 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా RRR సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మవుతోంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ఈ చిత్రం రిలీజ్ కానుంద‌ని చిత్ర‌బృందం ఇప్ప‌టికే కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఇటీవ‌లి స్పెక్యులేష‌న్స్ కి చెక్ పెడుతూ మేకింగ్ వీడియోలోనూ రిలీజ్ తేదీని ప్ర‌క‌టించి వేడెక్కించారు.

ఇక‌పోతే ఈ మూవీ పెండింగ్ చిత్రీక‌ర‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సీత పాత్ర‌ధారి ఆలియా స‌హా ప్ర‌ధాన తారాగ‌ణం పై చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. త్వరలోనే ఆలియా సెట్లలో చేరనుంది. ఈలోగానే త‌న అభిమానుల‌కు ఆలియా ఫీల‌ర్స్ వ‌దులుతోంది. తాజాగా అలియా జిమ్ దుస్తులలో తన సెల్ఫీని షేర్ చేసింది. స్నాప్ లో తన టోన్డ్ ఫిజిక్ ని ఎలివేట్ చేసిన తీరు ఆక‌ర్షించింది. అలియా భట్ ఇటీవ‌ల 40 రోజుల ఫిట్‌నెస్ ఛాలెంజ్ ను చేపట్టారు. స్వయంగా దానిని ధృవీకరిస్తూ ఇలా ఫోజిచ్చారు. ఈ లుక్ లో ఎంతో అర్ధంతరంగా ఉంది. ఆమె ప్రధాన ఫిట్‌నెస్ గోల్స్ ని అభిమానుల‌కు సెట్ చేస్తోంది.

RRR లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న‌ రామ్ చరణ్ స‌ర‌స‌న అలియా న‌టిస్తోంది. రాజమౌళి ఆలియా పాత్ర‌ను ఒక రేంజులోనే ఎలివేట్ చేస్తున్నార‌ని త‌న లుక్ చూడ‌గానే అర్థ‌మైంది. అలియా భట్ దక్షిణాదినా ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఆర్.ఆర్.ఆర్ ఆఫ‌ర్ తో త‌న పేరు మార్మోగిపోతోంది. త‌దుప‌రి సంజ‌య్ లీలీ భ‌న్సాలీ గంగుభాయి క‌తియావాడీలో వేశ్యాగృహ నిర్వాహ‌కురాలు లేడీ డాన్ పాత్ర‌లో ఆలియా క‌నిపించ‌నుంది. అలాగే ప్రియుడు ర‌ణ‌బీర్ తో క‌లిసి న‌టించిన బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ కి రానుంది.