Begin typing your search above and press return to search.

బీచ్ బేబీ ఆలియా టూ ఇన్ వన్ ట్రీట్

By:  Tupaki Desk   |   5 Jun 2021 8:00 AM IST
బీచ్ బేబీ ఆలియా టూ ఇన్ వన్ ట్రీట్
X
వ‌రుస‌గా నాలుగు పాన్ ఇండియా సినిమాల‌తో దేశంలోనే వేరొక స్టార్ త‌న‌ని ట‌చ్ చేయ‌లేని రేంజులో ఉంది ఆలియాభ‌ట్. రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ .. భ‌న్సాలీతో గంగుభాయి క‌తియావాడీ లాంటి క్రేజీ సినిమాలు చేస్తోంది. ర‌ణ‌బీర్ స‌ర‌స‌న న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ కి రావాల్సి ఉంది. త‌దుప‌రి శంక‌ర్ - రామ్ చ‌ర‌ణ్ సినిమా నాయిక‌గా ఆలియా పేరే వినిపిస్తోంది. మ‌రో నాలుగైదు క‌థ‌ల్ని ఫైనల్ చేసి వెయిటింగ్ లో పెట్టిందిట‌.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ అద్భుత ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఆలియా భ‌ట్ నిరంత‌రం ఈ వేదిక‌ల‌పై త‌న అభిమానుల‌కు అరుదైన ఫోటోల‌ను త‌న చిన్న‌నాటి స‌మాచారాన్ని అందిస్తూ యంగేజింగ్ స్టార్ గా వెలిగిపోతోంది. తాజాగా బీచ్ బేబీ అలియా భట్ టూ ఇన్ వన్ పోస్ట్ ఇంటర్నెట్ లో లక్ష‌లాది ఫాలోవ‌ర్స్ హృద‌యాల‌ను గెలుచుకుంది.

మొదటి ఫోటోలో అలియా సూర్యుని లేలేత కిర‌ణంలా పసుపు రంగులో మెరిసిపోతోంది. ఇది టీనేజీ లుక్ ని ఎలివేట్ చేస్తోంది. సముద్ర ప‌రిస‌రంలో ఒక‌ బుట్ట.. బీచ్ టవల్ పిక్నిక్ వైబ్స్ ని క్రియేట్ చేసాయి. అలాగే చిన్నారిగా ఉన్న‌ప్పుడు ఆలియా బీచ్ కి వెళితే ఎలా ఉండేదో కూడా ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆలియా ముఖంలో క్యూట్ నెస్ అమాయ‌క‌త్వం ఆక‌ర్షిస్తోంది. రణబీర్ కపూర్ సోదరి రిద్దిమా ఈ పోస్ట్ పై రెడ్ హార్ట్ ఈమోజీతో ల‌వ్ కురిపించారు. జాక్విలిన్- ఆకాంక్ష‌ రంజన్ కపూర్ .. తాహిరా కశ్యప్ ఈ ఫోటోపై ప్ర‌శంస‌లు కురిపించారు.

అలియా భట్ నిజమైన బ్లూ వాటర్ బేబీ అంటూ పొగిడేశారు. నిజానికి ఆలియా బీచ్ మ‌త్స్య‌క‌న్య‌లా మారిపోతుందంటూ పొగిడేశారు అభిమానులైతే. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో తెలుగు ఆడియెన్ లోనూ విప‌రీత‌మైన ఫాలోయింగ్ ని పెంచుకుంటున్న ఆలియా సౌత్ అంత‌టా ప‌రిచ‌యం కానుంది.