Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: RRR సీత మిలమిల మెరుపులు
By: Tupaki Desk | 20 May 2021 9:00 AM ISTనేటితరం నాయికల్లో క్రేజీ పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతోంది ఆలియాభట్. బ్యాక్ టు బ్యాక్ నాలుగు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఆర్.ఆర్.ఆర్ - బ్రహ్మాస్త్ర- గంగూభాయి కతియావాడీ ఇవన్నీ పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ లకు రెడీ అవుతుంటే.. తదుపరి కూడా పాన్ ఇండియా కథలు దర్శకుల్ని లాక్ చేసి ఆలియా రెడీగా ఉంది. శంకర్- చరణ్ సినిమాకి ఆలియా పేరు పరిశీలనలో ఉందని కథనాలొచ్చాయి.
ఇక సోషల్ మీడియాల్లో ఆలియా ట్రీట్ గురించి పరిచయం అవసరం లేదు. తాజాగా మెరుపులు మిరుమిట్ల డిజైనర్ డ్రెస్ లో ఈ బ్యూటీ మెరిసింది. తాజా లుక్ లో ఆలియా కాస్త చబ్బీగా కనిపిస్తోంది. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి తన వెయిట్ పెంచేసినట్టే కనిపిస్తోంది ఈ బ్యూటీ.
మరోవైపు ప్రియుడు రణబీర్ తో కలిసి నిర్మించుకుంటున్న డ్రీమ్ హౌస్ ఇటీవల ముంబైలో తౌక్తా తుఫాను ధాటికి దెబ్బ తిన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంటి నిర్మాణానికి భారీ అంతరాయం కలిగింది. నిర్మాణంలో ఉన్న ఇంటి వెలుపల ఉన్న సందు కూడా తీవ్రంగా దెబ్బతింది. పరిసరాల్లో కుప్పకూలిన చెట్లను తొలగించే సన్నివేశం కనిపిస్తోంది.
రణబీర్ కపూర్- అలియా భట్ .. నీతు కపూర్ లు పాలి హిల్ లోని ఇంటి నిర్మాణ వద్ద తరచూ కనిపిస్తుంటారు. ఇటీవలే ఈ బంగ్లా నిర్మాణం మొదలైంది. ఈ గ్రాండ్ మాన్షన్ కు రిషి కపూర్ తల్లిదండ్రులు రాజ్ కపూర్ - కృష్ణ కపూర్ పేర్లు పెట్టారు. చాలా కాలం క్రితం రణబీర్ కపూర్ ఈ బంగ్లా నుండి తన సొంత వాస్తు తో బ్యాచిలర్ ప్యాడ్ ని డిజైన్ చేయించారు. దీని ఇంటీరియర్ ను షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ చేశారు. బ్రహ్మాస్త్రలో రణబీర్ - ఆలియా జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.