Begin typing your search above and press return to search.

ట్రెండింగ్‌: స‌మ్మ‌ర్ లో ఆలియా జిల్ జిల్ జిగా

By:  Tupaki Desk   |   2 March 2021 8:00 AM IST
ట్రెండింగ్‌: స‌మ్మ‌ర్ లో ఆలియా జిల్ జిల్ జిగా
X
అక్టోబ‌ర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఆర్.ఆర్.ఆర్ లో సీత పాత్ర‌లో చెర్రీ స‌ర‌స‌న క‌నిపించ‌నుంది ఆలియా. ఈ మూవీతో పాటు ఆలియా న‌టించిన వ‌రుస పాన్ ఇండియా సినిమాలు 2021లో పెద్ద తెర‌పై మంట‌లు పెట్ట‌నున్నాయి.కెరీర్ బిజీ అలా ఉంటే మ‌రోవైపు ఆలియా స‌మ్మ‌ర్ ని ఎలా ఎదుర్కోబోతోంది? అంటే ఇవిగో కొన్ని గ్లింప్స్ ని ప‌రిచ‌యం చేయాలి. ఆలియా ధ‌రించిన ఐదు అత్యుత్త‌మ దుస్తులు ఎవ‌రికైనా వేస‌విని కూల్ గా ఉంచుతాయ‌నే చెప్పాలి.

వేసవి కాలం ఆల్రెడీ ఎంట‌రైంది. బీచ్ వెంట చిలౌట్ చేయాల‌న్నా.. ప‌బ్లిక్ లోకి మార్కెట్లో కి షాపింగుల‌కు వెళ్లాలంటే న‌డి నెత్తిన సూర్యుడు శివ‌తాండ‌వ‌మాడ‌తాడు. దానిని ఎదుర్కోవాలంటే ఆలియాని ఫాలో అయిపోతే స‌రిపోతుంది. ఇక ఇటీవ‌ల ఈ అమ్మ‌డు ఫాలో చేసిన ఫ్యాష‌న్స్ కి సంబంధించిన ఓ ఐదు ఫోటోలు అంత‌ర్జాలంలో హీట్ పుట్టించాయి. ఇప్పుడు మ‌రోసారి వేస‌వి కార‌ణంగా ఈ ఫోటోల‌న్నీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఫ్యాష‌న్ ప‌రంగా ఆలియాని అనుస‌రించేందుకు యూత్ ఆస‌క్తిగా ఉంది. ఆలియా వార్డ్ రోబ్ లో వెతికితే దొరికిన ఐదు స్పెష‌ల్ స‌మ్మ‌ర్ దుస్తుల్ని ప‌రిశీలించండి.