Begin typing your search above and press return to search.
అండర్ 30 లిస్టులో బాలీవుడ్ బ్యూటి
By: Tupaki Desk | 17 April 2017 5:07 AM GMTబాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇప్పటికే పలు సంచలనాలు సృష్టించేసింది. కేవలం ఐదేళ్ల కెరీర్ లోనే.. సీనియర్ స్టార్స్ కు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే స్థాయికి చేరిపోయింది. గతేడాది ఉడ్తా పంజాబ్ చిత్రానికి బెస్ట్ యాక్ట్రస్ గా నేషనల్ అవార్డ్ కూడా ఎక్స్ పెక్టే చేసినా.. దక్కలేదు.
అయితే నేషనల్ అవార్డు రాలేదని తానే బాధపడ్డం లేదని.. ఎవరూ బాధ పడద్దని.. ఆ అవార్డు చేతబుచ్చుకునేందుకు తన దగ్గర సమయం చాలానే ఉందని చెప్పింది ఆలియా భట్. తాజాగా ఈ బ్యూటీ మరో అరుదైన రికార్డు సాధించేసింది. ఫోర్బ్స్ మేగజైన్ ప్రచురించిన ఏషియా అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది ఆలియా భట్. 'భారీగా వసూళ్లు సాధించిన 20 చిత్రాల్లో ఆలియా భాగస్వామి. అలాగే ఆమె నటించిన వాటిలో కనీసం 6 సినిమాలో 15 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఇండియాతో పాటు.. ఓవర్సీస్ లోను విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఆలియా కూడా ఉంటుంది' అని ఫోర్బ్స్ మేగజైన్ తెలిపింది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో అరంగేట్రం చేసిన ఆలియా భట్.. ఇప్పుడు టాప్ యంగ్ స్టార్ అయిపోయింది. ఉడ్తా పంజాబ్ చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్న ఆలియా.. రీసెంట్ గానే ప్రతిష్టాత్మకమైన లోక్ మత్ మహరాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా దక్కించుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/