Begin typing your search above and press return to search.

బాత్ ట‌బ్బులో ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ సెగ‌లు

By:  Tupaki Desk   |   18 Feb 2022 12:30 PM GMT
బాత్ ట‌బ్బులో ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ సెగ‌లు
X
బాలీవుడ్ భామ‌లు ఈ మ‌ధ్య వ‌రుస‌గా ఇన్ స్టాని హీటెక్కించ‌డం ప‌నిగా పెట్టుకున్న‌ట్టున్నారు. జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే హాట్ హాట్ పోజుల‌తో నెట్టింట సంద‌డి చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. అదే పంథాలో రౌడీ బేబీ అన‌న్యా పాండే వాట‌ర్ బేబీగా మారిపోయి హోయ‌లు పోతూ మంట పెట్టేసింది. తాజాగా ఈ జాబితాలో `ఆర్ ఆర్ ఆర్‌` బ్యూటీ అలియా భ‌ట్ చేరిపోయింది.

రాజ‌మౌళి తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌` తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం రానున్న విష‌యం తెలిసిందే. ఈమూవీ మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ మూవీకి స‌రిగ్గా నెల ముందే అలియా న‌టించిన బాలీవుడ్ మూవీ `రంగుబాయి క‌తియా వాడీ` తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఈ మూవీ రిలీజ్ కి ముందే ఈ చిత్రాన్ని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శించారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం అలియా భ‌ట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా బెర్లిన్ కు వీడుకోలు ప‌లుకుతున్న‌ట్టుగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పోస్ట్ తో పాటు ఆస‌క్తిక‌ర‌మైన ఫొటోల‌ని కూడా అబిమానుల‌తో పంచుకుంది.

బాత్ ట‌బ్బులో హోయ‌లు పోతూ ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ సెగ‌లు పుట్టిస్తూ క‌నిపించింది. ముత్యాల‌తో పొదిగిన షార్ట్ డ్రెస్ ని ధ‌రించిన అలియా బాత్ ట‌బ్బులో ప‌డుకుని ఫొటోల‌కి పోజులిచ్చిన తీరు ఇన్ స్టాని మీటెక్కిస్తోంది. ముత్యాల‌తో డిజైన్ చేసిన బ్లేజ‌ర్ ని కూడా ధ‌రించి త‌న అబిమానుల‌కు అదిరిసోయే ట్రీట్ ఇచ్చేసింది. దీంతో ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి.

గ‌తంలో బికినీ ధ‌రించి హ‌ల్ చ‌ల్ చేసిన అలియా ఇప్పుడు ఏకంగా బాత్ ట‌బ్బులో షార్ట్ డ్రెస్‌లో థై షో చేస్తూ క‌నిపించ‌డం అభిమానుల‌ని స‌ర్ ప్రైజ్ కి గురిచేస్తోంది.

`ఆర్ ఆర్ ఆర్‌`తో టాలీవుడ్ లో హంగామా కు రెడీ అవుతున్న అలియా భ‌ట్ త్వ‌ర‌లో తెలుగులో మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ మూవీ త‌రువాత కూడా తెలుగులో బ‌న్నీతో చేయ‌డానికి కూడా అలియా రెడీ అవుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. హిందీలో రాకీ ఔర్ రాణీ కి ప్రేమ క‌హానీ - డార్లింగ్స్ - బ్ర‌హ్మాస్త్ర చిత్రాల్లో న‌టిస్తోంది.