Begin typing your search above and press return to search.

అఖిల్ రెండో సినిమా పిక్స్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   8 Jan 2016 5:30 PM GMT
అఖిల్ రెండో సినిమా పిక్స్ అయ్యిందా?
X
కొన్ని కాంబినేషన్ల వ్యవహారం వింటేనే ముచ్చటేస్తుంది. ఎక్కడలేని ఆసక్తిని.. కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. తాజాగా అలాంటి వార్తే ఒకటిప్పుడు టాలీవుడ్ లో హడావుడి చేస్తోంది. తన కొడుకును గ్రాండ్ గా లాంఛ్ చేద్దామని అక్కినేని నాగార్జున ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసినా ‘అఖిల్’కు షాక్ తప్పలేదు. ఫస్ట్ మూవీ అక్కినేని కుర్రాడ్ని భారీగా నిరాశ పర్చింది.

అందుకే.. అఖిల్ విషయంలో జరిగిన తప్పులు మళ్లీ చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ.. తర్వాతి సినిమాకు సంబంధించి చాలానే కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలానే స్క్రిప్ట్ లను విన్నారు. చివరకు హిందీలో సక్సెస్ అయిన ‘‘యే జవానీ హై దివానీ’ చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్న వార్త ఇప్పుడు వినిపిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి చెబుతున్న విశేషాలు చాలానే ఉన్నాయి. అఖిల్ తో సెకండ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది ఎవరో కాదు.. తనదైన బ్రాండ్ తో బాలీవుడ్ ను ఏలుతున్న కరణ్ జోహార్ గా చెబుతున్నారు. ఇక.. ఈ చిత్రానికి కరణ్ జోహార్ ఒక నిర్మాత అయితే.. నాగ్ కూడా పార్టనర్ గా ఉండనున్నారట. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.

అఖిల్ తొలి సినిమాకు అలియాను అనుకున్నా కుదర్లేదు. తాజాగా కరణ్ రంగంలోకి దిగటంతో అలియా ఓకే చెప్పేసిందని చెబుతున్నారు. ఇక.. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికీ తగ్గట్లుగా మార్చే విషయంలో వంశీ పైడిపల్లి సక్సెస్ అవుతాడని నాగ్ నమ్ముతున్నాడట. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ విషయాలు నిజమైతే.. అఖిల్ తన రెండో సినిమా విషయంలో ఆసక్తిని రేకెత్తించటంలో సక్సెస్ అయినట్లేనని చెప్పొచ్చు. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వివరాలు అధికారికంగా ఎప్పుడు బయటకు వస్తాయో..?