Begin typing your search above and press return to search.

నేను 'స్విచ్‌ ఆన్‌ - స్విచ్‌ ఆఫ్‌ యాక్టర్‌'ని అంటున్న అల్లరి పిల్ల...!

By:  Tupaki Desk   |   4 May 2020 1:30 AM GMT
నేను స్విచ్‌ ఆన్‌ - స్విచ్‌ ఆఫ్‌ యాక్టర్‌ని అంటున్న అల్లరి పిల్ల...!
X
ఆలియా భట్.. తన తండ్రి డైరెక్టర్ మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. దీనికంటే ముందు అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘సంఘర్ష్‌’ సినిమాలో కనిపించింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ ను సాధించిందని చెప్పవచ్చు. ఈ బ్యూటీ నటించిన పలు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపుతో పాటు పలు అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టాయి. ‘హైవే’ ‘2 స్టేట్స్‌’ ‘డీయర్‌ జిందగీ’ ‘రాజీ’ ‘కలంక్‌’ ‘గల్లీ బాయ్‌’ సినిమాలతో తానేమిటో నిరూపించుకుంది అల్లరి పిల్ల ఆలియా. ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రొటీన్ కి భిన్నమైన కొత్త పాత్రలను చేయడం అంత ఈజీ ఏమీ కాదని.. ఆ కష్టమేమిటో అనుభవపూర్వకంగా తెలిసిరావల్సిందేనని చెప్పింది. ‘కలంక్‌’ సినిమాలో ‘రూప్‌ చౌధురి’ పాత్ర చేయడం ఒక సవాలుగా నిలిచిందని.. రీల్‌ జీవితంలో ‘రూప్‌’కు నిజ జీవితంలో నాకు అసలు పోలికలే లేవని తెలిపింది.

‘కలంక్‌’లో నేను నృత్యం చేసిన ‘ఘర్‌ మోరె పర్‌ దేశియా’ పాటకు మంచి ప్రశంసలు వచ్చాయని.. కొందరైతే ‘మాధురి దీక్షిత్‌ లా చేశావు’ అన్నారని.. కాని ఆమెలా ఎవరూ డ్యాన్స్‌ చేయలేరనేది నా అభిప్రాయమని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ ని కాదని ‘ఎంజాయ్‌’ డ్యాన్సర్‌ నని తెలిపింది. ఒక ఏడాది పాటు కథక్‌ లో శిక్షణ తీసుకున్నానని.. ఏమాత్రం ఖాళీ దొరికినా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్నని.. నా ఫ్రెండ్స్‌ నీకు డ్యాన్స్‌ పిచ్చి బాగానే పట్టినట్లుందే అని ఆట పట్టించేవాళ్లని తెలిపింది. తన యాక్టింగ్ గురించి వివరిస్తూ ఒక సినిమాలో ఒక పాత్ర చేస్తున్నప్పుడు కెమెరా ముందు ఉన్నప్పుడే అందులో మమేకమైపోతానని.. అదేపనిగా ఆ పాత్ర మైకంలోనే ఉండిపోతే వేరే సినిమాలో చేస్తున్నప్పుడు సమస్యలు రావచ్చని.. ఏ సినిమాకు ఆ సినిమా ఏ పాత్రకు ఆ పాత్ర అన్నట్టుగానే ఉంటానని.. అందుకే నేను స్విచ్‌ ఆన్‌–స్విచ్‌ ఆఫ్‌ యాక్టర్‌ నని పేర్కొంది. మేల్‌ డైరెక్టర్లకు ఫిమేల్‌ డైరెక్టర్లకు మధ్య ఉన్న తేడా ఏమిటని అడుగగా డిఫరెన్స్ ఏమీ లేదని.. డైరెక్టర్‌ అంటే డైరెక్టరే అని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌ లో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్‌గా కనిపించనుంది. లాక్‌ డౌన్ ముగిసిన తరువాత 'ఆర్.ఆర్.ఆర్'లో ఆలియా భట్ జాయిన్ కానుంది. దీనితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయ్' సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా కింగ్ నాగార్జున - అమితాబ్ బచ్చన్ - రణబీర్ కపూర్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాలో కూడా అలియా భట్ నటిస్తోంది.