Begin typing your search above and press return to search.

స్విమ్మింగ్ పూల్ లో ఆలియా.. సూపరెహ

By:  Tupaki Desk   |   23 April 2016 11:30 AM GMT
స్విమ్మింగ్ పూల్ లో ఆలియా.. సూపరెహ
X
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ ఇప్పుడు తెగ సంతోషంగా ఉంది. ఈ భామ నటించిన ఉడ్తా పంజాబ్ విడుదలకు సిద్ధమవడం.. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడమే ఇందుకు కారణం. రిలీజ్ కు ముందే మంచి టాక్ రావడమంటే మామూలు విషయం కాదు.

ఉడ్తా పంజాబ్ కోసం ప్రత్యేకంగా బిహారీ భాష నేర్చుకుంది. అక్కడి స్థానికులు, ముఖ్యంగా పల్లెటూరి జనాలు మాట్లాడుకునే యాసను నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పడం.. ఈ మూవీలో మెయిన్ అట్రాక్షన్ పాయింట్. ఉడ్తా పంజాబ్ విడుదలకు మరో రెండు నెలల సమయం ఉండగానే.. తన పాత్రకు తొలిసారిగా ఇంత క్రేజ్ రావడం ఈ అమ్మడిని ఆనందంలో ముంచెత్తింది. ఈ సంతోషాన్ని తెగ ఎంజాయ్ చేసేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి చక్కర్లు కొట్టస్తోంది. రీసెంట్ గా ఆలియా భట్ తన ఫ్రెండ్స్ తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసిన సంగతిని ఓ ఫోటో ద్వారా పంచుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఓ స్పెషల్ ట్వీట్ కూడా పెట్టింది.

వీళ్లంతా అమ్మడికి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కావడంతో.. ఎంజాయ్ మెంట్ ఓ రేంజ్ లో ఉంది. ఎవరికి వారు ఒక్కో రకంగా సెల్ఫీలో పాలు పంచుకున్నారు. అఫ్ కోర్స్. అందరిలోకూ ఆలియానే స్పెషల్ అట్రాక్షన్ అయినా.. ఇలాంటి అల్లరి చిల్లరిగా సందడి చేసే ఆలియాను చూడ్డం.. అరుదైన దృశ్యమే కదా.