Begin typing your search above and press return to search.
ప్రియుడి బర్త్ డే.. RRR బ్యూటీ కేక్ తయారీ
By: Tupaki Desk | 28 Sep 2019 3:38 PM GMTస్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం ఏంటి? ఈ ప్రశ్న ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ ని అడగాలి. బ్రహ్మాస్త్ర సెట్స్ లో పరిచయం అయిన రణబీర్ తో నిండా పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఆలియా ప్రస్తుతం ఆ మైకం నుంచి బయటపడే సన్నివేశమే కనిపించడం లేదన్నది బాలీవుడ్ జనాల మాట. రణబీర్ గత ప్రేమాయణాల దృష్ట్యా అతడు అంత మంచి వాడు కాదని సన్నిహితులు హితబోధ చేసినా తనని మాత్రం విడిచిపెట్టలేదు ఆలియా.
అలాగని ఇదేమీ సరదాకి టైమ్ పాస్ లవ్ కాదు... ఇదేమీ ఆషామాషీ లవ్ కానే కాదు. సిద్ధార్థ్ మల్హోత్రా నుంచి విడిపోయాక రణబీర్ స్నేహం తనలో ఎంతో మార్పును తెచ్చిందని.. ఆనందం నింపిందని పలు సందర్భాల్లో ఆలియా వెల్లడించింది. ఇక ఈ ఇద్దరి లవ్ ని అధికారికంగా ధృవీకరించేందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరైపోయారు. అందుకే ఆ ఇద్దరూ ముంబై వీధుల్లో కనిపిస్తే చాలు మీడియా వెంటాడి వేధిస్తుంటుంది. ఈ జంట ప్రేమపై కామెంట్లు విన్నప్పుడు ఆలియా డాడ్ మహేష్ భట్ స్పందన తెలిసిందే. పెళ్లి వరకూ వెళ్లనీ అప్పుడు చూద్దాం! అని లైట్ తీస్కున్నారు. మరి ఇప్పటికీ ఈ జంట బహిరంగంగానే షికార్లు చేస్తుంటే పెళ్లి మాట ఆయన నోట కూడా వినిపించలేదు.
ఇక ప్రేమంటే ఇది మామూలు ప్రేమ కాదు. ఆలియా స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ఇదిగో ఇదే. నేడు రణబీర్ బర్త్ డే సందర్భంగా తనకు ఎలాంటి కానుకను ఇచ్చింది అంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈరోజు రణబీర్ కోసం తనే స్వయంగా కేక్ ని తయారు చేసింది. ఎంతో ప్రేమగా దగ్గర ఉండి బర్త్ డే ఈవెంట్ ని సెలబ్రేట్ చేసింది ఈ చిల్లుబుగ్గల చిన్నది. మరోవైపు రణబీర్ తన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ చాలానే సమయం వెచ్చించాడు. అవును.. ఎప్పుడు చూసినా రణబీర్ తోనే కనిపిస్తోంది? ఆర్.ఆర్.ఆర్ సెట్స్ కి ఎప్పుడొస్తుంది ఎప్పుడెళుతోంది.. ఏమిటో!!