Begin typing your search above and press return to search.

అయ్యో... అలాంటిదేం లేదండి!

By:  Tupaki Desk   |   15 Dec 2018 7:08 AM GMT
అయ్యో... అలాంటిదేం లేదండి!
X
బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌ బీర్‌ కపూర్‌ మరియు ఆలియా భట్‌ లు ప్రేమలో ఉన్నారన్న విషయం తెల్సిందే. తాజాగా ఆలియా భట్‌ తండ్రి మహేష్‌ భట్‌ కూడా వారిద్దరి ప్రేమ పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. మరో వైపు వీరిద్దరు బ్రహ్మాస్త్ర అనే మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు వీరిద్దరు జోరుగా హుషారుగా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న సమయంలోనే తాజాగా ఒక ఫొటో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

ఆ ఫొటోలో ఆలియా భట్‌ మరియు రణ్‌ బీర్‌ కపూర్‌ లు ఉన్నారు. రణ్‌ బీర్‌ కపూర్‌ చాలా సీరియస్‌ గా ఫోన్‌ లో ఇన్వాల్స్‌ అయ్యి ఉండగా, ఆలియా భట్‌ కూడా చాలా విచారకరమైన ఫేస్‌ తో ఉంది. ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో పాటు ఇద్దరి మద్య ఏదో జరిగిందని, ఆలియా తన పై కంటే రణ్‌ బీర్‌ కు ఫోన్‌ పై మోజు ఉన్నట్లుగా భావిస్తుందని, ఇద్దరి మద్య అప్పుడే విభేదాలు మొదలయ్యాయా అంటూ రకరకాలుగా పుకార్లు ప్రచారం జరిగింది.

సోషల్‌ మీడియాలో ఆ ఫొటో గురించి జరుగుతున్న చర్చపై ఆలియా భట్‌ స్పందించింది... ఆ రోజు తానేం విచారంగా లేనని, షూటింగ్‌ ఒత్తిడి నుండి కాస్త విశ్రాంతి పొందుతున్నాడు. ఆ సమయంలోనే అలా ఫేస్‌ పెట్టి ఉంటాను తప్ప నాకు ఎలాంటి బాధ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరితోనూ గొడవ లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది.