Begin typing your search above and press return to search.

త‌న‌ భ‌ర్త మాజీతో ఇంత‌టి బాండింగ్ షాకిస్తోందే!

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:44 AM GMT
త‌న‌ భ‌ర్త మాజీతో ఇంత‌టి బాండింగ్ షాకిస్తోందే!
X
క‌త్రిన కైఫ్ లాంటి అంద‌గ‌త్తెను ప్రేమించిన ర‌ణ‌బీర్ క‌పూర్ కొన్నేళ్ల స‌హ‌జీవ‌నం అనంత‌రం బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఆ ఇద్ద‌రూ డేటింగ్ చేసారు. కానీ క‌త్రిన కంటే ముందే దీపిక‌తోనూ అత‌డు ప్రేమ‌ స‌రాగాలు ప‌లికించాడు. ఎక్క‌డో ఏదో తేడా కొట్టి చివ‌రికి ఆ ఇద్ద‌రితోనూ బ్రేక‌ప్ అయ్యింది. క‌త్రిన‌తో బ్రేక‌ప్ స‌మ‌యంలోనే ర‌ణ‌బీర్ కి బ్ర‌హ్మాస్త్ర ప్రాజెక్ట్ కూడా సెట్ అయ్యింది. ఆ త‌ర్వాత బ్ర‌హ్మాస్త్ర‌లో క‌థానాయిక‌గా ఆలియాభ‌ట్ ని నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఫైన‌ల్ చేశారు. ఆయాన్ ముఖ‌ర్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సినిమా సెట్స్ పై ఉండ‌గానే ర‌ణ‌బీర్ - ఆలియా జంట ప్రేమాయ‌ణం స‌హ‌జీవ‌నం ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఇటీవ‌లే ఆలియాను పెళ్లాడి ఒక బిడ్డ‌కు తండ్రి అవుతున్నాడు ర‌ణ‌బీర్. ఆస‌క్తిక‌రంగా ఈ జంట న‌టించిన బ్ర‌హ్మాస్త్ర ఇటీవ‌లే విడుద‌లైంది. ప్ర‌చారార్భాటంతో బ్ర‌హ్మాస్త్ర‌కు ఆరంభ వ‌సూళ్లు బాగానే ఉన్నాయ‌న్న టాక్ ఉంది. సౌత్ లో ఆశించిన రేంజుకు చేరుకోలేక‌పోయింది.

ఇక ఈ సినిమా క‌థాంశం మొద‌లు ప్ర‌తిదీ ఆస‌క్తిని క‌లిగించేవే. ఈ మూవీ ప్ర‌థ‌మార్థం పోగొట్టుకున్న‌ అస్త్రంలోని మూడు ముక్కలను కనుగొనడమే ప‌ర‌మావ‌ధిగా సాగుతుంది. అదే క్ర‌మంలో ర‌ణ‌బీర్ -ఆలియా న‌డుమ ప్రేమాయ‌ణాన్ని చూపించారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు డిజైన్ చేయడంతో ఆలియా ఫ్యాన్స్ లో విస్త్ర‌తంగా చర్చనీయాంశమైంది.

ఇషా (ఆలియా) తన స్నేహితుడి పుట్టినరోజును జరుపుకోవడానికి శివ (రణబీర్) గదికి వచ్చినప్పుడు త‌ను నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే పిల్లలు అగ్నిపథ్‌ సినిమాలోని 'చికిని చమేలీ' పాటను ప్లే చేస్తారు. ఆ పాటలో కత్రినా కైఫ్ స్టెప్పులకు రణబీర్ డ్యాన్స్ చేస్తాడు. తరువాత అతను అలియా వైపు చూసినప్పుడు తను కూడా కత్రినా కైఫ్ లాగా యాక్ట్ చేయ‌డం కోర‌స్ డ్యాన్సింగ్ అంతా ఆస‌క్తిని క‌లిగించాయి.

నిజానికి క‌త్రిన నుంచి ర‌ణ‌బీర్ బ్రేక‌ప్ అయ్యాడ‌ని తెలిసాకే ఆలియా అత‌డిని పెళ్లాడింది కాబ‌ట్టి ఇప్ప‌టికీ క‌త్రిన‌తో మంచి స్నేహితురాలిగానే ఉంది. ఈ విష‌యంలో ఆలియా పెద్ద మ‌న‌సు గురించి ప్ర‌తిసారీ మెచ్చుకుని తీరాలి. కత్రినా- ఆలియా కొన్నేళ్లుగా జిమ్ లో మంచి స్నేహితులు. ఆ స్నేహం ఇప్ప‌టికీ కొనసాగుతోంది. ఆలియా న‌టించిన సినిమాల‌కు క‌త్రిన పాజిటివ్ రివ్యూల‌ను ఇస్తోంది. ఇక క‌త్రిన‌ను తాను స్ఫూర్తిగా తీసుకుని ఆలియా న‌ట‌రంగంలో కొనసాగుతోంది. పెళ్ల‌యాక కూడా భేష‌జానికి పోకుండా త‌న భ‌ర్త మాజీతో ఇంత‌టి బాండింగ్ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచేదే.

కానీ ర‌ణ‌బీర్ మాజీ అయిన‌ క‌త్రిన డ్యాన్సింగ్ చేసిన ఐకానిక్ పాట‌లో ఆలియా స్టెప్పు క‌ల‌ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయినా పిల్ల‌ల‌కు ఆ స‌మ‌యంలో ఆ పాట‌నే ఎందుకు చూపించాలి? అది కాకుండా ఇంకా ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి క‌దా? అన్న సందేహం క‌లగొచ్చు. కానీ అగ్నిప‌థ్ నిర్మించిన క‌ర‌ణ్ కి ఆ పాట‌పైనా హ‌క్కులున్నాయి గ‌నుకే ఎలాంటి కాపీ రైట్ రిస్క్ లేకుండా దానిని ఉప‌యోగించార‌నుకోవ‌చ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.