Begin typing your search above and press return to search.

సెలక్షన్ బాగుంది.. స్టైల్ సంగతేంటి?

By:  Tupaki Desk   |   16 Nov 2016 3:21 PM IST
సెలక్షన్ బాగుంది.. స్టైల్ సంగతేంటి?
X
ఆలియా భట్ కి ఏజ్ తక్కువే కానీ.. ట్యాలెంట్ బాగా ఎక్కువ. అన్ని విషయాల్లోనూ ఈ ట్యాలెంట్ చూపించేస్తూ ఉంటుంది. సినిమాల్లో యాక్టింగ్ ని మాత్రమే కాదు.. తను అటెండ్ అయ్యే పార్టీల్లో స్టైలింగ్ తో చెలరేగిపోతూ ఉంటుంది.

సహజంగా ఆలియా వేసే కాస్ట్యూమ్స్ చూడముచ్చటగా ఉంటాయి. కొత్త స్టైలింగ్ ని పరిచయం చేసేందుకు అమ్మడు చూపే ఉత్సాహం.. చాలా మందిని ఆకట్టుకుంటుంది. కానీ రీసెంట్ గా గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ కవర్ లాంఛింగ్ కు హాజరైన ఆలియా భట్ గెటప్.. మరీ కొత్తకొత్తగా ఉంది. వన్ సైడ్ మాత్రమే ఫుల్ స్లీవ్ ఉన్న బ్లాక్ డ్రస్ కు మార్కులు సరిగా పడలేదు సరికదా.. నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.

ఈ కామెంట్స్ అమ్మడి చెవిన కూడా పడ్డాయి. 'నేను ఈ ఈవెంట్ కోసం ఎంతో కష్టపడి వీటిని సెలెక్ట్ చేశా. కొత్త స్టైలింగ్ చూపించినపుడు మొదట ఇలాంటి కామెంట్స్ కామన్ గానే వస్తుంటాయ్' అంటూ విమర్శలను లైట్ తీసుకుంది ఈ బ్యూటీ. ఆ మాట కూడా నిజమే అయినా.. ట్రెండీగా సెలక్షన్ చేస్తే మాత్రమే సరిపోతుందా.. కాస్త నప్పే స్టైలింగ్ కూడా ఉండాలిగా అన్నది విమర్శకుల పాయింట్. వాళ్ల సంగతేమో కానీ.. ఫ్యాన్స్ మాత్రం.. ఆలియానే రైట్ అంటూ హంగామా చేసేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/