Begin typing your search above and press return to search.

ఎక్స్ ని పట్టించుకోలేదేంటి?

By:  Tupaki Desk   |   10 May 2018 11:21 AM IST
ఎక్స్ ని పట్టించుకోలేదేంటి?
X
బాలీవుడ్ లో సినీ తారల వేడుకలు జరిగితే ఆ హంగామా కొన్ని రోజుల వరకు ఆగదు. అందుకు సంబంధించిన ఎదో ఒక వార్త జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది చర్చించుకుంటున్న వార్త సోనమ్ కపూర్ వెడ్డింగ్ గురించే. సింపుల్ గా తన బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్న సోనమ్ ప్రస్తుతం మిగతా వేడుకల్లో బిజీ బిజీగా వుంది. ఇకపోతే ఇటీవల జరిపిన వేడుకకు సోనమ్ జంట బాలీవుడ్ సినీ తారలను ఇన్ వైట్ చేసింది.

ఈ ఈవెంట్ కి చాలా మంది సెలబ్రెటీలు వచ్చారు. అయితే అక్కడ ఎవరు ఊహించని విధంగా ఒక ఘటన జరగడం అందరిని ఆశ్చర్య పరచింది. అలియా భట్ - రన్ బీర్ కపూర్ తో కలిసి వస్తుండగా ఆ సైడ్ నుంచి ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వెళ్లడం మిడియా లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సిద్దార్థ్ మల్హోత్రా - అలియా ఎలాంటి వేడుకలకు వెళ్ళినప్పటికి కలిసి వెళ్లేవారు. ఇప్పటివరకు ఉన్న వారి ప్రేమ గురించి రోజు ఎదో ఒక న్యూస్ హాట్ టాపిక్ అయ్యేది.

అయితే ప్రస్తుతం ఎదురుగా ఉన్నా కూడా పలకరించుకొని పరిస్థితి ఏర్పడింది. కొందరి హీరోయిన్స్ తో సిద్దార్థ్ సన్నిహితంగా ఉండడం వంటి కారణాల చేత బ్రేకప్ వచ్చిందని అప్పట్లో టాక్ బాగానే వచ్చింది. ఇక ఇటీవల ఇద్దరు పక్క పక్కనే ఉన్న కూడా చూసి చూడనట్టుగా వెళ్లిపోతుండడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మిడియలో వైరల్ గా మారింది.