Begin typing your search above and press return to search.
ఆర్‌ఆర్‌ఆర్ కంటే ముందే మరో సినిమా కోసం..!
By: Tupaki Desk | 4 Oct 2020 1:00 PM ISTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ మరియు ఆలియా భట్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఈ సినిమా కోసం వారిద్దరు కూడా త్వరలో హైదరాబాద్ రావాల్సి ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటించడానికి ముందే వారిద్దరు కలిసి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న 'గంగూభాయ్ కతియావాడి' సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు.
త్వరలో గంగూభాయ్ సినిమాలో ఆలియా భట్ నటించేందుకు రెడీ అవుతుంది. ఈ నెల చివర్లో అజయ్ దేవగన్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. వీరిద్దరు కలిసి డిసెంబర్ లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతానికి చరణ్ మరియు ఎన్టీఆర్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణకు జక్కన్న ప్లాన్ చేశాడు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కంటే ముందే గంగూబాయ్ కతియావాడి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అందుకే మొదట ఆలియా మరియు అజయ్ దేవగన్ లు ఆ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.