Begin typing your search above and press return to search.
అతడి గత అఫైర్స్‌ను పట్టించుకోను
By: Tupaki Desk | 24 Jun 2019 11:30 AM GMTబాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ గత కొంత కాలంగా యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఇరు కుటుంబాల వారు వీరికి ఎప్పుడు ఓకే అయితే అప్పుడు పెళ్లి చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఇద్దరు కూడా కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న కారణంగా పెళ్లికి నో చెబుతూ వస్తున్నారు. పెళ్లి మాట ఎత్తితే కస్సుమంటున్న ఆలియా భట్ తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ గురించి మాత్రం మాట్లాడేందుకు వెనకాడటం లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆలియా భట్ మాట్లాడుతూ... ప్రస్తుతం మేమిద్దరం కూడా చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నాం. నా జీవితంలోకి రణ్ బీర్ రావడంతో నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. అతడు వచ్చి నా జీవితాన్ని కొత్తగా చేయడంతో పాటు.. నా జీవితంలో సంతోషాన్ని నింపాడు. గతంలో అతడికి ప్రేమ వ్యవహారాలు ఉన్న విషయం వాస్తవమే. అయితే నేను ఆ అఫైర్స్ గురించి పట్టించుకోను. ఎందుకంటే నాకు కూడా గతంలో అలాంటి అఫైర్లు ఉన్నాయి కదా అంటూ చాలా లైట్ గా సమాధానం చెప్పింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఆలియా భట్ తెలుగులో కూడా ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈ అమ్మడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు త్వరలోనే రణ్ బీర్ కపూర్ ను వివాహం చేసుకోవడం కన్ఫర్మ్ అని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.