Begin typing your search above and press return to search.

రణ్ బీర్ తో మానసికంగా నా పెళ్లి జరిగిపోయింది: అలియా

By:  Tupaki Desk   |   26 Feb 2022 9:00 AM IST
రణ్ బీర్ తో మానసికంగా నా పెళ్లి జరిగిపోయింది: అలియా
X
బాలీవుడ్ తెరపై మంచి క్రేజ్ ఉన్న భామల్లో అలియా భట్ ఒకరు. అలియా అంత పొడగారికి కాదు .. అలా అని చెప్పేసి భారీ పర్సనాలిటీ కూడా కాదు. కుర్ర హీరోల జోడీగా కుదురుగా ఇమిడిపోయే రూపం ఆమె సొంతం. అలియా తెరపై ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో .. సోషల మీడియాలోను అంతే హుషారుగా అనిపిస్తుంది.

ఇటు గ్లామర్ పరంగాను ప్రేక్షకులను కట్టిపడేయగలదు .. అటు నటన పరంగాను మెప్పించగలదు. ఈ కారణంగానే యూత్ లో ఈ బ్యూటీకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అందువలన ఆమె సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంటాయి.

ఇక అలియా భట్ తన సినిమాల విషయాల కంటే కూడా రణ్ బీర్ తో ప్రేమ వ్యవహారం పరంగానే జనం నోళ్లలో ఎక్కువగా నానుతూ ఉంటుంది. ఈ ఇద్దరి గురించి అనేక వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. వాటిని వాళ్లిద్దరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఎవరేమి అనుకుంటే మనకేమి అనుకుంటూ షికార్లు కొడుతుంటారు.

ఏ సందర్భంలో అలియా మీడియా ముందుకు వచ్చినా రణ్ బీర్ తో పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఆమెకి ఎదురుకాకుండా ఉండదు. అలా తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది.

అలియా తాజా చిత్రంగా రూపొందిన 'గంగూబాయి కతియావాడి' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో .. 'రణ్ బీర్ తో పెళ్లి ఎప్పుడు?' అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. " పెళ్లి అనేది నా వ్యక్తిగతం .. దాని గురించి నేను ఎవరికీ చెప్పవలసిన పని లేదు.

ఇక రిలేషన్ షిప్ లో ప్రశాంతంగా ఉన్నప్పుడే చేసుకోవాలని అనుకున్నాను. అలాంటి ప్రశాంతతనే నేను ఇప్పుడు పొందుతున్నాను. ఇక నేను మొదటి సారి తెరపై రణ్ బీర్ ను చూసినప్పుడే ఆయనను పెళ్లి చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను. అలాగే జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. అయినా మానసికంగా ఆయనతో నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది" అని చెప్పుకొచ్చింది.