Begin typing your search above and press return to search.

పెళ్లి ఎప్పుడంటే? న‌న్న‌డుగుతావేంటి అనేసిన అలియా!

By:  Tupaki Desk   |   18 Dec 2021 8:54 AM IST
పెళ్లి ఎప్పుడంటే? న‌న్న‌డుగుతావేంటి అనేసిన అలియా!
X
ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ ల ప్రేమాయ‌ణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు చాలా కాలంగా రిలేష‌న్ లో ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఈగో క్లాషెస్ త‌లెత్తాయ‌ని విడిపోతున్నార‌ని కూడా ప్ర‌చారం సాగింది. కానీ అందులో వాస్త‌వం లేద‌ని తేలిపోయింది. ఇటీవ‌లే విక్కీ కౌశ‌ల్-క‌త్రినాకైఫ్ పెళ్లి చేసుకున్న నేప‌థ్యంలో ర‌ణ‌బీర్-అలియా కూడా డిసెంబ‌ర్ లో పెళ్లి భాజాలు మ్రోగ‌డం ఖాయంగా వినిపించింది.

కానీ డిసెంబ‌ర్ మిడ్ కి వ‌చ్చేసినా పెళ్లి సంగ‌తి బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు `బ్ర‌హ్మ‌స్ర్త‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా ఇద్ద‌రి మ‌ద్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ చోటు చేసుకుంది.

ఓ ప్రేక్ష‌కుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నార‌ని సూటిగా అడిగేసాడు. దీనికి వెంట‌నే ర‌ణ‌బీర్ -అలియా వైపు చూసి పెళ్లి ఎప్పుడు అని ప్ర‌శ్నించాడు? దానికి అలియాభ ట్ న‌న్ను అడుగుతావేంటి? నాకేం తెలుసు అన్న‌ట్లు ముఖం పెట్టింది. ఈ స‌న్నివేశాన్ని బ‌ట్టి ఈ జంట ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఆలోచ‌నలో లేన‌ట్లు తేలిపోయింది.

మ‌రి ర‌ణ‌బీర్ జోక్ లా అడిగాడా? అలియా ఆ కోణంలో నే అలా రియాక్ట్ అయిందా? అన్న‌ది తేలాలంటే స‌మ‌యం ప‌డుతుంది. ఇదే వేదిక‌పై ర‌ణ‌బీర్ త‌న మ‌న‌సులో మాట‌ని కూడా బ‌య‌ట‌పెట్టాడు. నాకు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల‌ని ఉంది అని తెలిపాడు.

అలాగే విక్కీ-క్యాట్ ల పెళ్లి గురించి స్పందించాడు. ప్రేమ త‌ర్వాత పెళ్లి ఎంతో షంతోషంగా ఉంద‌ని..క‌ల‌కాలం క‌లిసి ఉండాల‌ని కోరుకున్నాడు. అంటే ర‌ణ‌బీర్ మ‌న‌సులో వీలైనంత త్వ‌ర‌గా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిపోవాల‌ని ఉంద‌న్న విష‌యం క్లియ‌ర్ గా ఉంది. ప‌బ్లిక్ గా అలియానే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? అని అడిగేసాడు కాబ‌ట్టి అస‌లు సంగ‌తి అంతా అలియా చేతుల్లోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. అంటే బంతి ఇప్పుడు అలియా కోర్టులో ఉంద‌న్న మాట‌.