Begin typing your search above and press return to search.

అలా జరగలేదు అనేసిందిగా ఆలియా

By:  Tupaki Desk   |   28 Nov 2016 4:00 AM IST
అలా జరగలేదు అనేసిందిగా ఆలియా
X
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్.. బాగా స్పీడ్ అనే సంగతి తెలిసిందే. యంగ్ఏజ్ లోనే ఈ బ్యూటీ చూపిస్తున్న స్పీడ్ కి సీనియర్ భామలంతా షాక్ తినేస్తున్నారు కూడా. రీసెంట్ గా షారూక్ ఖాన్ పక్కన కూడా నటించేసి మెప్పించేసిన ఈ బ్యూటీపై.. అఫైర్లకు సంబంధించిన రూమర్లు కూడా ఉన్నాయి.

కొన్నాళ్ల పాటు సిద్ధార్ధ మల్హోత్రాతో ఆలియా లవ్ అఫైర్ నడిపించేసింది. అయితే.. ఈ మధ్య వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారని అంతా అనుకున్నారు. అఫైర్ గురించి కానీ.. బ్రేకప్ గురించి కానీ ఎప్పుడూ ఈ చిన్నది నోరు విప్పలేదు కానీ.. ఇన్ డైరెక్టుగా ఓ విషయాన్ని వెల్లడించింది. రియల్ లైఫ్ లో ఎప్పుడన్నా హార్ట్ బ్రేక్ అయిందా ఆలియా అని అడిగితే.. 'అబ్బో చాలాసార్లే జరిగింది. మనం ప్రేమించిన వాళ్లు తిరిగి మనల్ని అంతగా ఇష్టపడ్డం లేదని అనిపించినపుడు హార్ట్ బ్రేక్ సహజమే కదా' అనింది ఆలియా.

మరి రీసెంట్ గా ఇలా ఏదన్నా జరిగిందా అంటే.. 'రీసెంట్ టైమ్ లో అయితా నాకు హార్ట్ బ్రేక్ లాంటి వేమీ లేవు' అని చెప్పింది ఆలియా. సిద్ధార్ధ మల్హోత్రాతో బ్రేకప్ జరగలేదనే విషయాన్ని ఇలా ఇన్ డైరెక్టుగా చెప్పిందని.. అర్ధం తీసేస్తున్నారు బాలీవుడ్ మీడియా జనాలు.