Begin typing your search above and press return to search.

#RRR.. కుర్ర‌బ్యూటీని మ‌ర్రిచెట్టు తొర్ర‌లో దాచేస్తావా జ‌క్క‌న్నా?

By:  Tupaki Desk   |   29 Oct 2020 5:15 AM GMT
#RRR.. కుర్ర‌బ్యూటీని మ‌ర్రిచెట్టు తొర్ర‌లో దాచేస్తావా జ‌క్క‌న్నా?
X
రాజమౌళి RRR చిత్రీక‌ర‌ణ‌ కోవిడ్ వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు జ‌క్క‌న్న త‌దుప‌రి షెడ్యూల్ కోసం ప్లాన్ రెడీ చేశారు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కీలక పాత్ర పోషించబోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. తాజా అప్ డేట్ ప్రకారం ఈ క్యూట్ బ్యూటీ నవంబర్ లో సెట్స్ లో చేరనుందిట‌. అలియా పై ఆర్.‌ఎఫ్.‌సిలో ఒకే షెడ్యూల్ లో చిత్రీకరించ‌నున్నారని తెలిసింది. అందుకోసం అలియా ఇక్కడ ఒక నెల రోజులు స్టే చేస్తుంద‌ట‌. దాంతో ఆర్.‌ఎఫ్.‌సిలో ఉండటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిసింది.

చాలావరకు షూట్ ఆర్ ‌ఎఫ్ ‌సి పరిసరాల్లో జరుగుతుంది. సీత పాత్ర‌ధారిపై చిత్రీక‌ర‌ణ అంతా ఫిలింసిటీలోనే. అందుకే ఆ ప‌రిస‌రాల్ని అమ్మ‌డు వ‌దిలి వెళ్ల‌కుండా జ‌క్క‌న్న లాక్ చేస్తున్నార‌ట‌. అలియా బస కోసం ప‌క‌డ్భందీ ప్లాన్ చేశార‌ట గురుడు. ఆమె తన భాగాన్ని పూర్తి చేసిన తర్వాతనే ఆర్.ఎఫ్‌.సి వ‌దిలి వెళ్లాలా? అంటూ జ‌క్క‌న్న మైండ్ సెట్ గురించి తెలిసిన వారు చెణుకులు విసురుతున్నారు.

ఇప్ప‌టికే రామారావు రామ్ చ‌ర‌ణ్ ల‌ను ఎటూ క‌ద‌ల‌నివ్వ‌కుండా లాక్ చేసిన రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ పూర్త‌య్యేంత‌వ‌ర‌కూ ఇదే వైఖ‌రిని క‌లిగి ఉంటాడు. ఇక ఆర్టిస్టులు కూడా త‌న‌కు కావాలి అన్న‌ప్పుడు అందుబాటులో ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు ఆలియా కూడా ఎటూ క‌ద‌ల‌కుండా లాకింగ్ సిస్ట‌మ్ రెడీ చేస్తున్నారంటూ స‌ర‌దాగా పంచ్ లు వేస్తున్నారు తెలిసిన‌వాళ్లంతా. అన‌గ‌న‌గా ఒక మాంత్రికుడు త‌న ప్రాణాన్ని చిల‌క‌గా మార్చి మ‌ర్రిచెట్టు తొర్ర‌లో దాచేశాడ‌ట‌. అలా వుంటుంది జ‌క్క‌న్న వ్య‌వ‌హారం అంటూ జోక్స్ వేస్తున్నారు బోయ్స్.

అయినా 2021 స‌మ్మ‌ర్ కి సినిమాని రిలీజ్ చేయాలంటే ఈ లాకింగ్ సిస్ట‌మ్ స‌రైన‌దేన‌ని గుస‌గుస‌లాడేసుకుంటున్నారు మ‌రి. ఆలియా ఈ చిత్రంలో సీత‌గా నటిస్తుంటే చ‌ర‌ణ్ రామ‌రాజుగా న‌టిస్తున్నారు. ఇక కొమురంభీమ్ గా న‌టిస్తున్న తార‌క్ స‌ర‌స‌న విదేశీ బ్యూటీ ఒలీవియా న‌టిస్తోంది.