Begin typing your search above and press return to search.

అదిరేటి డ్రెస్సు మీరేస్తే దడ

By:  Tupaki Desk   |   15 April 2015 9:00 AM IST
అదిరేటి డ్రెస్సు మీరేస్తే దడ
X
అదిరేటి డ్రెస్సు మీరేస్తే .. బెదిరేటి వయసు నాదైతే .. దడ! .. భారతీయుడు సినిమాలోని పాట ఇది. ఇక్కడున్న ఈ ముద్దుగుమ్మను చూస్తే ఆ పాట గుర్తుకు రావాల్సిందే. బాలీవుడ్‌ హాట్‌గాళ్‌ ఆలియాభట్‌ అటు సూపర్‌హిట్‌లు కొట్టడంలో, ఇటు ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ మార్చేయడంలో చాలా స్పీడ్‌గా ఉంది. నవతరం నాయికల్లో జెట్‌స్పీడ్‌ ఉన్న భామామణిగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది.

కుర్రాళ్ల గుండెల్లో కలల రాకుమారిగా వెలిగిపోతున్న ఈ భామ ఇటీవలే ఓ ప్రచార కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇలా దర్శనమిచ్చింది. అదిరిపోయే డెనిమ్‌ బ్లూ జీన్స్‌లో తెల్లని క్లాత్‌ మిక్సింగుతో సరికొత్త కాంబినేషన్‌ అటాచ్‌ చేసిన డిజైనర్‌ వేర్‌లో దర్శనమిచ్చింది. పిక్కలపైకి టైట్‌ఫిట్‌లో యువతరం పిచ్చెక్కిపోయే స్టయిల్‌లో కనిపించింది. సూపర్‌ మోడల్స్‌కి, ఫ్యాషన్‌ ఐకన్‌లకే పాఠాలు నేర్పే గురువులా కనిపించింది ఆలియా...

భట్‌ల కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మడు స్టార్‌గా తనని తాను ఆవిష్కరించుకున్న తీరు అసాధారణమైనది. అందం, ప్రతిభ రెండిటితో నెగ్గుకొస్తూ అటు పోటీ నాయికలు సోనమ్‌, సోనాక్షి, శ్రద్ధ వంటివారికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇలాంటి డ్రెస్‌లో చూశాక చెమటలు పట్టాల్సిందే మరి!