Begin typing your search above and press return to search.

#ఆలియా జోరు.. ఇక్క‌డ సీత అక్క‌డ పారు!

By:  Tupaki Desk   |   14 March 2021 11:14 AM GMT
#ఆలియా జోరు.. ఇక్క‌డ సీత అక్క‌డ పారు!
X
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది ఆల‌యా భ‌ట్. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను క్రేజీ ప్రాజెక్టుల‌తో ఈ అమ్మ‌డు బిజీ. ఇందులో ఆర్.ఆర్.ఆర్ లాంటి 2021 మోస్ట్ అవైటెడ్ మూవీలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో సీత‌గా న‌టిస్తున్న ఆలియా.. అటు బాలీవుడ్ క్రేజీ చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌లో పార్వ‌తిగా న‌టిస్తోంది. ఈ రెండు పాత్ర‌లు థియేట‌ర్ల‌లో ఆడియెన్ ని మెస్మ‌రైజ్ చేస్తాయ‌ని.. ఆలియా మ‌రోసారి మాస్ట‌ర్ క్లాస్ పెర్ఫామెన్స్ తో అభిమానుల‌కు ట్రీటిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది.

మ‌రోవైపు క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీతో గంగూభాయి క‌తియావాడీ అనే భారీ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈ మూవీలో గంగూభాయి అనే వేశ్యా గృహ నిర్వాహ‌కురాలిగా న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇంత‌కుముందు రిలీజైన టీజ‌ర్ లో ఆలియా అభినివేశానికి క్లాప్స్ ప‌డ్డాయి. ఆర్.ఆర్.ఆర్ సీత పాత్ర‌కు.. బ్ర‌హ్మాస్త్ర పారూ పాత్ర‌కు భిన్నంగా గంగూభాయి పాత్ర వేరియేష‌న్ ఆక‌ట్టుకోనుంది. ఇలాంటి వ‌రుస విల‌క్ష‌ణ పాత్ర‌లతో ఆలియా రేంజ్ మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.