Begin typing your search above and press return to search.
గ్యారేజ్ స్పూఫ్...మోహన్ లాల్ కాదు భజన్ లాల్!
By: Tupaki Desk | 14 Sept 2016 1:05 PM ISTఅల్లరి నరేష్ సినిమాల్లో మెయిన్ ఎలిమెంట్ స్పూఫ్ లే. `సుడిగాడు`తో స్పూఫ్ కామెడీ మరింత పీక్స్ కి చేరింది. అందులో ఏకంగా అడ్వర్టైజ్ మెంట్లని కూడా వాడేసుకొన్నారు. అయితే ప్రతి సినిమాలోనూ అదే అంటే మరీ మొనాటనీ అయిపోతుందని భావించిన నరేష్ మనసు మార్చుకొని కథల్లో నుంచే వినోదం పుట్టించే సినిమాల్ని చేశాడు కొంతకాలం. ఆ కోవలో వచ్చిన `బందిపోటు` తరహా సినిమాలు ఫలితం మాత్రం తీసుకురాలేకపోయాయి. అందుకే మళ్లీ ఇటీవల తనకి అచ్చొచ్చిన స్పూఫ్ లపైనే మనసు పెట్టాడు నరేష్. మొన్న విడుదలైన `సెల్ఫీరాజా` కూడా స్పూఫ్‌లతో నిండిందే. అంతకుముందు సినిమాలో పోలిస్తే నరేష్ కాస్త నవ్వించిందంటే ఈ సినిమానే.
త్వరలో రాబోతున్న నరేష్ కొత్త సినిమా `ఇంట్లో దెయ్యం నాకేం భయం` సినిమా విషయంలోనూ స్పూఫ్ కామెడీనే నమ్ముకొన్నట్టు సమాచారం. లేటెస్ట్ సినిమా `జనతా గ్యారేజ్`ని ఇందులో స్పూఫ్ చేసినట్టు తెలిసింది. ఆ సినిమాలో జనతా గ్యారేజ్ కాస్త సమంత గ్యారేజ్ అయిపోయిందట. మోహన్ లాల్ కాస్త భజన్ లాల్ అయిపోయాడు. భజన్ లాల్ గా అలీ తెరపై దర్శనమివ్వబోతున్నాడు. అలీ భజన్ లాల్ గెటప్ ఎలా ఉంటుందో మచ్చుకు చూపిస్తూ సెల్ఫీ తీసుకొని ఫేస్ బుక్ లో పెట్టాడు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం దసరాకి విడుదల కాబోతోంది.