Begin typing your search above and press return to search.

RRR బ్యూటీకి ఏడ్చినంత ప‌నైంది!

By:  Tupaki Desk   |   28 Aug 2019 10:30 PM GMT
RRR బ్యూటీకి ఏడ్చినంత ప‌నైంది!
X
ఏదైనా ఒక చిన్న డిస్ట్ర‌బెన్స్ జ‌రిగినా లైఫ్ స‌ర్కిల్ పూర్తిగా తేడా కొట్టేస్తుంది. స్టార్ల విష‌యంలో అయితే ఒక్కోసారి ప‌రిణామం తీవ్రంగానే ఉంటుంది. ఎన్నో అద్భుత‌మైన‌ ఆఫ‌ర్లు కూడా వ‌దులుకోవాల్సి వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియాభ‌ట్ స‌న్నివేశ‌మిదే. ఈ అమ్మ‌డు మోస్ట్ అవైటెడ్ 2020 మూవీ `ఆర్.ఆర్.ఆర్`లో న‌టిస్తున్నా.. ఈ ప్రాజెక్టుతో పాటే స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించ‌నున్న `ఇన్ షాల్లా` కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూసింద‌ట‌. అందుకు ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. ఒక‌టి స‌ల్మాన్ లాంటి స్టార్ స‌ర‌స‌న ఆలియాకి ఛాన్స్ రావ‌డం అన్న‌ది క్రేజీ. అలాగే బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే ఛాన్స్ అంటే అస్స‌లు వ‌దులుకునే ప్ర‌స‌క్తే లేదు. భారీత‌నం నిండిన క‌థాంశాల్ని ఎంచుకోవ‌డ‌మే కాదు.. అంతే భారీగా ఎంతో ఎమోష‌నల్ డ్రైవ్ తో సినిమాలు తీసే భ‌న్సాలీ చిత్రాల్లో క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కు న‌టించే స్కోప్ ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకే ఇప్పుడు భ‌న్సాలీ భారీ బ‌డ్జెట్ చిత్రం `ఇన్ షాల్లా` క్యాన్సిల్ అని చెప్ప‌గానే ఆల్మోస్ట్ ఏడ్చినంత ప‌ని చేసింద‌ట‌. స‌ల్మాన్ - భ‌న్సాలీ జోడీని న‌మ్ముకుని ఆలియా ఇప్ప‌టికే కాల్షీట్లు కేటాయించేసింది. సెప్టెంబ‌ర్ లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సి ఉండ‌గా... స‌డెన్ గా ఊహించ‌ని ట్విస్టు షాకిచ్చింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ తో స‌ల్మాన్ ఈ ప్రాజెక్టును కాద‌నుకున్నారు. అత‌డు కాద‌ని అన‌డంతో ఈ ప్రాజెక్టు కోసం వేచి చూసిన అభిమానులు సైతం నీరుగారిపోయారు.

స‌ల్మాన్ - భ‌న్సాలీ కాంబినేష‌న్ అన‌గానే 1999 క్లాసిక్ హిట్ `హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్` గుర్తుకు వ‌స్తుంది. అందుకే మ‌రోసారి ఇంత గ్యాప్ త‌ర్వాత‌ అదే జోడీ రిపీట‌వుతున్నారు అన‌గానే అంతా ఆస‌క్తిగా వేచి చూశారు. మిగ‌తా వాళ్ల‌ మాటేమో గానీ.. వీళ్ల కోసం అమీర్ ఖాన్ స‌ర‌స‌న వ‌చ్చిన ఓ క్రేజీ ఆఫ‌ర్ ని ఆలియా కాద‌నుకోవాల్సి వ‌చ్చిందిట‌. అందుకే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అన‌గానే త‌న వెంటే టిష్యూ పేప‌ర్లు పెట్టుకుంద‌ని బాలీవుడ్ మీడియా గుస‌గుసగా మాట్లాడుకుంది. `ఇన్ షాల్లా` చిత్రంతో కాల్షీట్ల క్లాష్ రావ‌డం వ‌ల్ల‌నే అమీర్ సినిమాని వ‌దులుకుందిట ఆలియా.