Begin typing your search above and press return to search.

'ఐ లవ్ యూ రాజా'ని తీసేయమన్నారంట!

By:  Tupaki Desk   |   10 Sep 2017 4:04 PM GMT
ఐ లవ్ యూ రాజాని తీసేయమన్నారంట!
X
అలీ, పోసాని కృష్ణమురళి పరిచయం అక్కర్లేని పేర్లు. అలీ బాల్యం నుంచే చిన్నచిన్నపాత్రల్లో నటిస్తూ కమెడియన్, హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ప్రస్తుతం టాప్ కమెడియన్ లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇక పోసాని కృష్ణమురళి అసిస్టెంట్ రైటర్ గా ప్రస్థానం ప్రారంభించి ఆ పై రైటర్ గా - దర్శకుడిగా - నటుడిగా తన విభిన్నమాడ్యులేషన్ కూడిన డైలాగులతో అలరిస్తున్నసంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? విషయం ఉందండి.. 'ఉంగరాల రాంబాబు' ప్రీ-రిలీజ్‌ వేడుకలో భాగంగా పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఇంకా వెన్నుపోట్లు ఉన్నాయని, మానవత్వం లేకుండా పోతోందన్నారు. దీనికి ఆయన నిదర్శనాలు కూడా చూపడం గమనార్హం. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అలీ ఒక రోజు తన దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడని పోసాని చెప్పారు.

*నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించానని దానికి అలీ ఓ సినిమాలో నిన్ను - నన్ను తీసుకున్నారని - కానీ, మరొకడు వచ్చి వీళ్లకెందుకు ఇంత డబ్బు ఇవ్వాలి? వీడైతే తక్కువకు వస్తాడు. వాడైతే తక్కువకు వస్తాడు అంటూ తమ ఇద్దరిని సినిమా నుంచి తీసేయించారని చెప్పాడు* అని పోసాని అన్నారు. ఇది విన్న తర్వాత ఇంకా ఇలాంటి వెధవలు ఉంటారా? అని బాధ కలిగినట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు చూస్తే గుండెపగిలిపోయేంత బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.