Begin typing your search above and press return to search.

కాంచన-3 నటి ఆత్మహత్య.. హోటల్ గదిలో అఘాయిత్యం.. ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   23 Aug 2021 11:42 AM IST
కాంచన-3 నటి ఆత్మహత్య.. హోటల్ గదిలో అఘాయిత్యం.. ఏం జరిగింది?
X
రాఘవ లారెన్స్ తీసిన ‘కాంచన3’ మూవీలో అతడి లవర్ గా.. దెయ్యంగా నటించిన 24 ఏళ్ల రష్యన్ నటి తన ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. అలెగ్జాండ్రా జావి అనే రష్యన్ నటి రాఘవ లారెన్స్ ‘కాంచన3’ లో నటించి మెప్పించారు. పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో ఆమె తన నటనతో అలరించారు. హఠాత్తుగా ఆమె మరణించిందన్న వార్త విషాదం నింపింది.

గోవాలో ఆమె బస చేసిన హోటల్ లోనే మృతిచెందింది. స్థానికుల సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితం తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఆమె డిప్రెషన్ లో ఉందని కూడా పోలీసులు చెబుతున్నారు. డిప్రెషన్ లోకి వెళ్లి ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

2019లో చెన్నై ఫొటో గ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అలెగ్జాండ్రా జావి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. ఇక ఆ కోణంలో కూడా పోలీసులు అనేక రకాలుగా విచారణ జరుపుతున్నారు.

ఇప్పటికే అలెగ్జాండ్రా జావి మరణ వార్తను వారి బంధువులకు చేరవేశారు. మృతికి గల కారణాలను తెలిసుకునే పనిలో పోలీసులు పడ్డారు.

2019లో ఒక ఫొటోగ్రాఫర్ తన ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అలెగ్జాండ్రా జావి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.