Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలో ఇంత హాటెస్ట్ రొమాంటిక్ క‌పుల్ వేరే ఎవ‌రూ లేరు!

By:  Tupaki Desk   |   27 Nov 2021 8:00 AM IST
ప్ర‌పంచంలో ఇంత హాటెస్ట్ రొమాంటిక్ క‌పుల్ వేరే ఎవ‌రూ లేరు!
X
అలనా పాండే... లైగ‌ర్ బ్యూటీకి క‌జిన్ అన్న సంగ‌తి తెలిసిందే. లైగ‌ర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న అన‌న్య పాండే రూపు రేఖ‌ల్ని క‌లిగి ఉంటుంది. ఇంచుమించు అన‌న్య ఫీచ‌ర్స్ తోనే ఈ అమ్మ‌డు అద‌ర‌గొట్టేస్తోంది. ఈ బ్యూటీ అన‌న్య తండ్రి చంకీ పాండేకి మేనకోడలు. అలన్నా పాండే బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ డీన్ పాండే కుమార్తె.

అలన్నా పాండేకు సోషల్ మీడియా సెన్సేష‌న్ గానూ అంద‌రికీ తెలుసు. ఈ బ్యూటీ మాంచి ట్రావెల్ ఫ్రీక్.. అలన్నా వివిధ దేశాలను అన్వేషించడానికి ఇష్టపడుతుంది. బీచ్ వెకేషన్ అంటే చెవి కోసుకుంటుంది. ఇప్ప‌టికే అల‌న్నా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తున్నాయి. అల‌న్నాకు ఇన్ స్టాగ్రామ్ లో 400 కె కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలన్నా తన స్టైలిష్ గ్లామరస్ ఫోటోల‌తో అంత‌కంత‌కు హీట్ పెంచేస్తుండ‌డంతో ఫాలోయింగ్ వేగంగా పెరుగుతోంది. ఇటీవ‌ల ఈ బ్యూటీ విదేశీ బీచ్ ల‌లో సెలవు దినాల్లో చిల్లింగ్ చేస్తోంది. ఇంటర్నెట్ సెన్సేషన్ అలన్నా ఒక ఫ్యాషన్ స్టూడెంట్. తన అద్భుతమైన క్రియేటివ్ గెట‌ప్పుల‌తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు.

ఆమె ఏస్ ఫ్యాషన్ డిజైనర్ మోనిషా జైసింగ్ కుమారుడు యుడి జైసింగ్ తో డేటింగ్ చేస్తోంది. అలన్నా - యుడి ఒకరితో ఒకరు డేటింగ్ లో ఉన్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. తాజాగా బీచ్ వెకేష‌న్ లో రొమాంటిక్ క‌పుల్ రంజైన రొమాన్స్ వీడియో వైర‌ల్ గా మారింది. ఈ జంట కామ‌సూత్ర భంగిమ‌ల‌తో చెల‌రేగ‌డం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌పంచంలో ఇంత హాటెస్ట్ రొమాంటిక్ క‌పుల్ వేరే ఎవ‌రూ లేరు! అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు మ‌రి.