Begin typing your search above and press return to search.
భరత్.. చిట్టిబాబులకు కొద్ది దూరంలో బంటు
By: Tupaki Desk | 22 Jan 2020 1:30 AM GMTఅల్లు అర్జున్ సంక్రాంతికి అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం బన్నీ గతంలో ఎప్పుడు రాబట్టని వసూళ్లను ఈ చిత్రం రాబడుతోంది. త్రివిక్రమ్ కెరీర్ లో కూడా ఈ చిత్రం అత్యధిక వసూళ్లను కూడా ఈ చిత్రం దక్కించుకుంటున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు బన్నీ తన ఏ సినిమాతో కూడా ఓవర్సీస్ లో రెండు మిలియన్ ల వసూళ్లను దక్కించుకోలేక పోయాడు.
టాప్ 10 లో కాని టాప్ 20లో కాని ఓవర్సీస్ కలెక్షన్స్ జాబితాలో అల్లు అర్జున్ ఇన్నాళ్లు ఉండేవాడు కాదు. కాని ఇప్పుడు అల వైకుంఠపురంలో చిత్రంతో టాప్ 5లో చేరాడు. మూడు మిలియన్ ల డాలర్లను రాబట్టి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మరో వీకెండ్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతంకు భరత్ అనే నేను చిత్రం 3.42 మిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో ఉండగా అల వైకుంఠపురంలో చిత్రం 3.02 మిలియన్ డాలర్లతో అయిదవ స్థానంలో ఉంది.
వచ్చే వీకెండ్ కు ఏమాత్రం వసూళ్లు నమోదు అయినా కూడా భరత్ అనే నేను చిత్రాన్ని బీట్ చేసి నాల్గవ స్థానంలో బన్నీ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి 2 మొదటి స్థానంలో ఉండగా.. బాహుబలి చిత్రం రెండవ స్థానంలో.. రంగస్థలం మూడవ స్థానంలో ఉన్నాయి. అల వైకుంఠపురంలో ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే రంగస్థలంను కూడా బీట్ చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఫుల్ రన్ తర్వాత అల వైకుంఠపురం ఏ స్థానంలో ఉంటుందో చూడాలి.