Begin typing your search above and press return to search.
OMG డాడీ చర్చలు అంటున్న థమన్!
By: Tupaki Desk | 15 May 2020 11:45 AM ISTఈ మధ్య కాలంలో 'అల వైకుంఠపురములో' మ్యూజిక్ క్లిక్ అయినట్టు ఏ ఇతర సినిమా సంగీతం కూడా క్లిక్ కాలేదు. ఒక సినిమాలో ఒకటో రెండో పాటలు హిట్ కావడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఆల్బం లో ఉండే అన్నీ పాటలు ఇలా సూపర్ హిట్స్ గా నిలవడం అరుదు. 'అల వైకుంఠపురములో' అలాంటి ఫీట్ నే అలవోకగా సాధించింది. ఈ సినిమాలో పాటలు అన్నీ ఒకదానికి మరొకటి సంబంధం లేదు అన్నట్టుగా విభిన్నంగా ఉంటాయి. ఈ ఆల్భంలో OMG డాడీ ఒక రాప్ సాంగ్.
త్రివిక్రమ్ ఫ్యాన్ ఎకౌంట్ నుంచి ఈమధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో త్రివిక్రమ్.. థమన్.. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ముగ్గురూ ఏదో డిస్కషన్లో ఉన్నారు. ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ చర్చలు OMG డాడీ పాట కోసం అయి ఉంటుందని ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన థమన్ "ఇదో లవ్లీ పిక్. ఓ మై గాడ్ డాడీ రాప్ లైన్స్ కోసం చర్చ. పక్కనే ఉన్నది ఈ పాటకు సాహిత్యం అందించిన కృష్ణ చైతన్య" అంటూ చర్చ ఎందుకనేది క్లారిటీ ఇచ్చారు.
నిజానికి ఈ పాట మిగతా పాటల రేంజ్ లో సంచలనం సృష్టించలేదు కానీ ఈమధ్యకాలంలో తెలుగులో వచ్చిన డిఫరెంట్ సాంగ్. అర్బన్ మ్యూజిక్ లవర్స్ కు మత్రం ఈ రాప్ సాంగ్ తెగ నచ్చింది. కాకినాడ లో పుట్టిన పాట కాబట్టి కాకినాడ రాప్ అనుకోవాలేమో!