Begin typing your search above and press return to search.
టీజర్: అర సెకనులో వైకుంఠం చూయించాడు
By: Tupaki Desk | 9 Dec 2019 2:03 PM GMTఅర సెకనులోనే వైకుంఠం చూపించడమెలా? ఇదిగో ఇక్కడ బన్ని వాలకం చూస్తుంటే అదెలాగో ఇట్టే అర్థమైపోతోంది. స్టైల్ గా లిఫ్ట్ దిగాడు. దిగుతూనే తెల్ల చొక్కాపై ఎర్ర సూటు తొడిగాడు. ఆ తర్వాత ఏమైనా తగ్గాడా అంటే .. ఆఫీస్ లోకి అతడు ఎంట్రీ ఇచ్చిన స్టైల్ చూసి వామ్మోవ్ .. అదేంటో ఈ వీడియో చూస్తే మీకే తెలిసొస్తుంది. మరీ ఇంత పద్ధతిగానా..!
ఆఫీస్ లో అందరూ పద్ధతిగా ఉంటారు. కానీ బన్ని ఏంటి ఇలా వరుసగా పేర్చి ఉన్న బల్లల పైనుంచి వెళుతున్నాడు? పైగా ఒళ్లంతా కుదుపులతో చింతామణిలా ఆ పాదాల కుదుపులేంటి? ఫార్మల్ ఫ్యాంట్ తొడిగి కాంబినేషన్ బ్లాక్ ఫ్యాంటుతో అలా అలా నడిచి వెళుతుంటే .. ఆఫీస్ ఉద్యోగులంతా దానిని ఎంతో ఫన్నీగాను వింతగానూ చూస్తుంటే.. ఓహో ఇలా కూడా ఉంటుందా? అన్న సందేహం కలగక మానదు. అర సెకనులోనే ఇంత చూపించారు మాయావి!
త్రివిక్రముడా మజాకానా? ఆయనలోని పోయెట్రీ మొత్తం ఈ సెకనున్నర కిక్ టీజర్ లో కనిపిస్తోంది. బన్ని ఫ్యాన్స్ కి ఇలాంటి ఛమక్కులు గ్లింప్స్ సినిమా ఆద్యంతం చాలానే ఉంటాయని అదిరే ట్రీట్ ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు.11 డిసెంబర్ 4:05 పీఎం అల.. పూర్తి టీజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే త్రివిక్రమ్ పైనా అల వైకుంఠపురములో కథపైనా బోలెడన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. క్లాసిక్ మూవీ ఇంటి గుట్టును కాపీ కొట్టారని .. మలయాళ బ్లాక్ బస్టర్ థీమ్ తీసుకున్నారని గొణిగేస్తున్నారు. అయితే ఏం చేసినా కానీ కుటుంబ సమేతంగా ఆస్వాధించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. సంక్రాంతి పుంజుల్లా వస్తున్నారు. అందుకే ఓవైపు సరిలేరు లిరికల్ వీడియో.. మరోవైపు అల.. కిక్ టీజర్ నేటి సాయంత్రం రిలీజయ్యాయి. ఆ రెండూ అంతర్జాలంలోకి జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయ్. అల.. ఆఫీస్ లో బన్ని ట్రీట్ కి సంబంధించిన టీజర్ ఇదిగో..