Begin typing your search above and press return to search.

యూఎస్: 3 మిలియన్ మార్క్ దిశగా అల

By:  Tupaki Desk   |   20 Jan 2020 5:05 AM GMT
యూఎస్: 3 మిలియన్ మార్క్ దిశగా అల
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కలెక్షన్స్ జోరుగా నమోదు చేస్తోంది. ఈమధ్య ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు పెద్దగా సత్తా చాటడం లేదు. అయితే 'అల వైకుంఠపురములో' అంచనాలకు మించి భారీ వసూళ్లు రాబడుతూ అందరికీ సర్ప్రైజ్ ఇస్తోంది.

సెకండ్ వీక్ లో కూడా నిలకడగా కలెక్షన్స్ సాధిస్తూ అదివారం నాటికి $2.8 మిలియన్ మార్క్ చేరింది. శుక్రవారం - $212k.. శనివారం - $384.. ఆదివారం - $300k(వివరాలు అందే సమయానికి) కలెక్షన్ సాధించింది. ఈ వసూళ్లతో మూడు మిలియన్ల మార్క్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సోమవారానికి 3 మిలియన్ మార్క్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో అల్లు అర్జున్ కు ఇదే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా కావడం గమనార్హం.

అమెరికాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన లిస్టులో 'అల వైకుంఠపురములో' ప్రస్తుతం 7 వ స్థానంలో ఉంది. టాప్-10 చిత్రాల లిస్టు ఇలా ఉంది.

1) బాహుబలి 2: $20M
2) బాహుబలి: $6.99M
3) రంగస్థలం: $3.51M
4) భరత్ అనే నేను:$3.41M
5) సాహో: $3.23M
6) శ్రీమంతుడు: $2.89M
7) అల వైకుంఠపురములో: $2.8M
8) సైరా: $2.6M
9) మహానటి: $2.54M
10) గీతగోవిందం: 2.46M