Begin typing your search above and press return to search.

ఫేక్ కలెక్షన్స్ పై అల టీమ్ సెటైర్?

By:  Tupaki Desk   |   13 Jan 2020 10:49 AM GMT
ఫేక్ కలెక్షన్స్ పై అల టీమ్ సెటైర్?
X
స్టార్ హీరోల సినిమాల విడుదలైన సమయంలో కలెక్షన్ల గురించి.. రికార్డుల గురించి మాట్లాడుకోవడం సాధారణం. ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోల సినిమాల కలెక్షన్ రికార్డులను ఇతర హీరోల సినిమాలతో పోల్చి సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. ఇక యాంటి ఫ్యాన్స్ వాటికి కౌంటర్లు వేస్తూ అవన్నీ ఫేక్ కలెక్షన్లని విమర్శిస్తుంటారు. ఇక కొందరు హీరోలు.. నిర్మాతలు స్వయంగా ఫేక్ కలెక్షన్లను ప్రచారంలోకి తీసుకొచ్చి తమ సినిమాను గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఏవి రియల్ కలెక్షన్స్.. ఏవి ఫేక్ అనేది కనుక్కోవడం సాధారణ ప్రేక్షకులకు చాలా కష్టం. తాజాగా ఈ ఫేక్ కలెక్షన్స్ పై అల్లు అర్జున్ సెటైర్ వేసేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురము లో' నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లలో ఊహకు అందని కలెక్షన్ ఫిగర్లను ముద్రించాలని.. ఫేక్ కలెక్షన్లపై సెటైర్ వెయ్యాలని అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' టీమ్ కు సూచించారట. దీంతో ఫేక్ కలెక్షన్స్ ను చెలామణిలోకి తీసుకొస్తున్న వారికి.. వాటిని నమ్ముతున్న చాలామందికి ఒక పంచ్ వేసినట్టు ఉంటుందని అన్నారట. త్వరలో 'అల వైకుంఠపురములో' సినిమాకు 'అవతార్' సినిమా రేంజ్ కలెక్షన్ ఫిగర్స్ ను చూడొచ్చన్నమాట.

అయితే అల్లు అర్జున్ సెటైర్ ఎవరి మీద అనే విషయం తెలివైన పాఠకులకు చిటికెలో అర్థం అయి ఉంటుంది. ఎందుకంటే ఈతరంలో పప్పు-లు చాలా తక్కువగా ఉంటారు. ఉండే జనాలందరూ దేశముదుర్లే. వారికి ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా హింట్స్ ఇవ్వాల్సిన పనే లేదు.