Begin typing your search above and press return to search.

రీ యూనియన్‌ బన్నీకి తెలియదట

By:  Tupaki Desk   |   12 Jan 2021 3:30 PM GMT
రీ యూనియన్‌ బన్నీకి తెలియదట
X
అల్లు అర్జున్‌ అల వైకుంఠపురం హ్యాంగోవర్‌ నుండి బయటకు రాలేదా అంటూ నెటిజన్స్‌ కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. ఇన్నేళ్ల సినీ కెరీర్‌ లో ఇండస్ట్రీ కొట్టాను అంటూ బన్నీ చాలా సంతోషంగా ఉన్నాడు. అది సరే కాని ఆ సినిమా గురించి మళ్లీ జనాల్లో చర్చ జరిగేందుకు ఏడాది తర్వాత రీ యూనియన్‌ అని చెప్పి కూడా డబ్బా కొట్టుకోవాలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఈ రీయూనియన్ విషయం అసలు బన్నీకి తెలియదు అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు. అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు బన్నీకి తెలుసు. కాని ఈ ఒక్క రీ యూనియన్ తప్ప.

రీ యూనియన్‌ కార్యక్రమంలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. తాను ఒక రోజు బాల్కనీలో కూర్చని కాఫీ తాగుతున్న సమయంలో ఏదైనా మంచి సినిమా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఈ స్టోరీ లైన్ వచ్చింది. దాన్ని వెంటనే కథగా డెవలప్‌ చేశాము. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అల్లు అర్జున్‌ గారికి తెలిసే జరిగింది. ఆయన ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్‌ అయ్యారు. సినిమా విడుదల అయ్యే వరకు అన్ని విషయాలను దగ్గర ఉండి చూసుకున్నారు. కాని రీ యూనియన్ కార్యక్రమంకు మాత్రం నిర్వహిస్తున్నట్లుగా చివరి నిమిషంలో చెప్పి సర్‌ ప్రైజ్‌ ఇచ్చామని త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చారు.