Begin typing your search above and press return to search.

మళ్లీ వార్తల్లో నిలిచిన బన్నీ హిందీ వైకుంఠపురం

By:  Tupaki Desk   |   3 Feb 2022 1:30 AM GMT
మళ్లీ వార్తల్లో నిలిచిన బన్నీ హిందీ వైకుంఠపురం
X
అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురంలో సినిమా 2020 సంవత్సరంలో వచ్చింది. ఆ సంవత్సరంలో హైయెస్ట్‌ గ్రాసర్ గా సౌత్‌ ఇండియాలో నిలిచిన అల వైకుంఠపురంలో సినిమా ను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. గత ఏడాదిలోనే సినిమా పట్టాలెక్కినా కూడా కరోనా కారణంగా ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇదే సమయంలో బన్నీ పుష్ప సినిమా తో బాలీవుడ్‌ లో వంద కోట్లను దక్కించుకున్నాడు. ఏమాత్రం ప్రమోషన్ లేకుండా కేవలం ఫేస్ వ్యాల్యూ మరియు సినిమా కంటెంట్‌ తో వంద కోట్లు దక్కించుకున్న ఘనత బన్నీకి దక్కింది. అందుకే బన్నీకి ఇప్పుడు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ ఉద్దేశ్యంతోనే అల వైకుంఠపురంలో సినిమా డబ్బింగ్‌ రైట్స్ ను దక్కించుకున్న నిర్మాణ సంస్థ బన్నీ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు డబ్బింగ్‌ చేసి విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

గత నెల ఆరంభంలోనే అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ వర్షన్ ను విడుదల చేయాలని భావించారు. కాని ఒక వైపు సినిమా రీమేక్ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఇలా డబ్బింగ్‌ చేసి థియేటర్ల ద్వారా విడుదల చేస్తే ఎవరు చూస్తారు అంటూ రీమేక్‌ మేకర్స్ అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పెద్ద వివాదమే జరిగింది. దాంతో నిర్మాతలు నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో డబ్బింగ్‌ వర్షన్ ను విడుదల చేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లుగా డబ్బింగ్‌ రైట్స్ దక్కించుకున్న హిందీ నిర్మాత ప్రకటించాడు. థియేటర్‌ రిలీజ్ ను మిస్‌ చేసుకున్న అల వైకుంఠపురంలో హిందీ వర్షన్‌ త్వరలో శాటిలైట్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా డిజిటల్‌ ఫార్మట్‌ ద్వారా కూడా అల వైకుంఠపురంలో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. సినిమా డబ్బింగ్ వర్షన్‌ ను థియేటర్‌ రిలీజ్ అయితే ఆపారు కాని శాటిలైట్‌ స్ట్రీమింగ్ ను మాత్రం ఆపే అవకాశం లేదు.

అల వైకుంఠపురంలో హిందీ వర్షన్ ను ఫిబ్రవరి 13 లేదా 14న వాలెంటైన్స్ డే సందర్బంగా స్క్రీనింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. అంతే కాకుండా యూట్యూబ్‌ ద్వారా కూడా ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి బన్నీ హిందీ వైకుంఠపురం బిగ్‌ రిలీజ్ మిస్‌ అయినా చిన్న రిలీజ్ మాత్రం పక్కా అన్నట్లుగా అక్కడి మీడియా వర్గాల వారు అంటున్నారు. పుష్ప సినిమా తో వచ్చిన క్రేజ్ కారణంగా అల్లు అర్జున్‌ హిందీ అల వైకుంఠపురంలో సినిమా కు మంచి ఆధరణ దక్కడం ఖాయం అంటున్నారు. రీమేక్ అయిన సినిమాలను శాటిలైట్‌ ఛానల్స్ లో టెలికాస్ట్‌ చేయడం.. యూట్యూబ్‌ లో స్ట్రీమింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కనుక అల వైకుంఠపురంలో రీమేక్ కు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ కూడా డబ్బింగ్‌ వర్షన్‌ విడుదల అయినంత మాత్రాన రీమేక్‌ కు ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు. మొత్తానికి వైకుంఠపురం మళ్లీ హిందీ వార్తల్లో నిలిచింది.