Begin typing your search above and press return to search.

బ‌న్నీ 'అల..' రిలీజ్ కు బిగ్ బ్రేక్

By:  Tupaki Desk   |   21 Jan 2022 2:30 PM GMT
బ‌న్నీ అల.. రిలీజ్ కు బిగ్ బ్రేక్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ మూవీ 2020 జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బ‌న్నీ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫేమ‌స్ అయ్యాయి. దీంతో ఇత‌ర భాష‌ల్లో ఈ మూవీని చూడాల‌ని సినీ ప్రియులు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.

ఈ మూవీ హిందీ రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ మేక‌ర్ మ‌నీష్ షా సొంతం చేసుకున్నారు. ఇందులో కార్తీక్ ఆర్య‌న్, కృతి స‌న‌న్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ కూడా మొద‌లైంది. `షెహ‌జాదా` పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ స్థాయిలో తెర‌కెక్క‌తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో మ‌నీషా కోయిరాలా, ప‌రేష్ రావెల్‌, రోనిత్ రాయ్‌, స‌చిన్ ఖేడేక‌ర్ న‌టిస్తున్నారు.

ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్న కార్తీక్ ఆర్య‌న ఎలాంటి ఫొటోస్ ని కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం లేదు. ఎవ‌రైనా పోస్ట్ చేయాల‌ని చూసినా ఎలాంటి ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయొద్ద‌ని వారిని ప్ర‌త్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇదిలా వుంటే `పుష్ప‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో బ‌న్నీ న‌టించిన `అల వైఉంఠ‌పుర‌ములో` చిత్రాన్ని హిందీలో విడుద‌ల చేయాల‌ని గోల్డ్ మైన్ పిక్చ‌ర్స్ సంస్థ హిందీ వెర్ష‌న్ అనువాద హ‌క్కుల్ని సొంతం చేసుకుంది. దీన్ని జ‌న‌వ‌రి 26న దేశ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నామంటూ ప్ర‌క‌టించింది కూడా.

అయితే తాజాగా హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ ని విడుద‌ల చేయ‌డం లేద‌ని గోల్డ్ మైన్ పిక్చ‌ర్స్ వ‌ర్గాలు శుక్ర‌వారం ప్ర‌క‌టించాయి. ఈ మూవీ రిలీజ్ విష‌య‌మై `షెహ‌జాదా` మేక‌ర్స్, గోల్డ్ మైన్ పిక్చ‌ర్స్ అధినేత మ‌నిష్ షా తో చ‌ర్చ‌లు జ‌రిపారు. దీంతో ఈ మూవీ హిందీ వెర్ష‌న్ రిలీజ్ ని నిలిపి వేస్తున్న‌ట్టుగా మ‌నీష్ షా తో క‌లిసి `షెహ‌జాదా` మేక‌ర్స్ శుక్ర‌వారం సంయుక్తంగా ఓ ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేశారు.

తాము అడిగిన వెంట‌నే `అల వైకుంఠ‌పుర‌ములో` హిందీ డబ్బింగ్ వెర్ష‌న్ రిలీజ్ ని నిలిపి వేసినందుకు `షెహ‌జాదా` మేక‌ర్స్ గోల్డ్ మైన్ పిక్చ‌ర్స్ అధినేత మ‌నీష్ షా కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హిందీ రీమేక్ లో న‌టిస్తున్న కార్తీక్ ఆర్య‌న్ ఈ మూవీ కోసం ఉకంగా ఆరు నెల‌ల కాల్షీట్స్ ఇవ్వ‌డం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. `షెహ‌జాదా` ఈ ఏడాది డిసెంబ‌ర్ 4న విడుద‌ల కాబోతోంది.