Begin typing your search above and press return to search.

2020 అల వైకుంఠపురందే..!

By:  Tupaki Desk   |   11 Jun 2020 5:40 PM IST
2020 అల వైకుంఠపురందే..!
X
అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రంగా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకున్న ఈ చిత్రంకు పోటీగా మరే సినిమా వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది మొత్తం కూడా టాలీవుడ్‌ కు చేదు అనుభవమే. మొదటి రెండు నెలల వరకు సినిమాలు విడుదల అయినా మళ్లీ ఇప్పట్లో సినిమాలు విడుదల అయ్యే అవకాశం కనిపించడం లేదు. మొన్నటి వరకు ఈ ఏడాది చివర్లో సినిమాలు వస్తాయనుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌ షూటింగ్స్‌ ప్రారంభం అయినా కూడా సినిమాల విడుదల విషయంలో మాత్రం ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. దాంతో వచ్చే ఏడాది వరకు కొత్త సినిమాలు రాకపోవచ్చు. కనుక ఈ ఏడాదిలో టాప్‌ చిత్రంగా అల వైకుంఠపురంలోనే నిలిచింది. ప్రతి ఏడాది ఒక సినిమా టాప్‌ గా నిలుస్తుంది. కాని ఈ సినిమా మాత్రం టాలీవుడ్‌ లోనే కాకుండా సౌత్‌ లోనే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా రికార్డు సొంతం చేసుకుంది. తర్వాత స్థానంలో మహేష్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం నిలుస్తుందని అంటున్నారు.