Begin typing your search above and press return to search.

రియ‌ల్ హీరో స‌రే.. లైవ్ లో ఆ తిప్ప‌లేంటి?

By:  Tupaki Desk   |   5 Oct 2019 7:16 AM GMT
రియ‌ల్ హీరో స‌రే.. లైవ్ లో ఆ తిప్ప‌లేంటి?
X
రియాలిటీ షోల లైవ్ లో చిత్ర విచిత్రాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఆ విచిత్రాలు చూసేవారి కోణాన్ని బ‌ట్టి మారిపోతున్నాయి. కొన్ని స్క్రిప్టు బేస్డ్ అని తెలిసిపోతోంది. మ‌రికొన్ని నిజాల‌తో కూడుకుని క‌ల్పితాలు అబ‌ద్ధాలు అని అర్థ‌మైపోతోంది. అయితే ఇది ఏ రకం రియాలిటీనో కానీ.. రియాలిటీ షో లో ఆ వింత జ‌నాల్ని నిశ్చేష్టుల‌ను చేసింది.

లైవ్ లో తాడుకు వేలాడుతూ కింద ఉన్న నీటి తొట్టెలో దిగాలి! అన్న‌ది టాస్క్. ఈ టాస్క్ లో పాల్గొన్న ఇద్ద‌రిలో ఒక‌రు బాగానే ఉన్నా.. ఇంకొక‌రు మాత్రం రోప్ పైనే స్పృహ కోల్పోయి కింద ప‌డ‌బోయారు. నేల వైపు వాలిపోతూ సోలిపోతూ ఉంటే ఆ ప‌క్క‌నే ఉన్న కంటెస్టెంట్ కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అత‌డు కూడా రోప్ పై ఉండ‌డంతో షో గెస్ట్ గా వ‌చ్చిన‌ కిలాడీ అక్ష‌య్ కుమార్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి ఆ కంటెస్టెంట్ ని కాపాడారు. నేల‌పై ప‌డాల్సిన అత‌డిని ఏదోలా నీటి తొట్టె అంచు నుంచి బ‌య‌టికి లాగ‌గ‌లిగారు.

ఈ సీను అంతా ఎక్క‌డ జ‌రిగింది అంటే ఓ టీవీ చానెల్ రియాలిటీ షోలో. పార్టిసిపెంట్ అలీ అస్గ‌ర్ తో పాటు వేరొక కంటెస్టెంట్ ఈ సాహ‌సానికి పాల్ప‌డి స్పృహ కోల్పోయాడు. అత‌డిని కాపాడేందుకు కిలాడీ స‌హా క్రూ బృందం ప‌రుగులు పెట్టారు. హౌస్ ఫుల్ 4 ప్ర‌మోష‌న్స్ లో ఉన్న అక్ష‌య్ కుమార్ స‌ద‌రు షోలో ఆ పార్టిసిపెంట్ ని కాపాడార‌ట‌. ఆ విష‌యాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో స‌హా ప్ర‌చారానికి పెట్టారు.

అంతా బాగానే ఉంది.. ఇది స్క్రిప్టు కాకూడ‌ద‌నే కోరుకుందాం. అయితే అందులో నిజం ఏదో అబ‌ద్ధం ఏదో అలా ఉంచితే కిలాడీ అక్ష‌య్ పై మాత్రం ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. అత‌డు 'రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరో కూడా అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. పొగ‌డ్త‌లు స‌రే కానీ.. అమాయ‌క సాహ‌స‌వీరుల ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఈ లైవ్ వేదిక‌లు.. షోలు ఏమిటో అంటూ వేరొక సెక్ష‌న్ నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రీ అంత సుకుమారుడిని ఇలాంటి సాహ‌సాల‌కు ఎలా ఓకే చెప్పారు.. ఎందుకు ఎలో చేశారు? అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టీవీ రియాలిటీల్లో సాహ‌సాలు శ్రుతి మించుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. 2008లో 'ఖత్రోన్‌ కే ఖిలాడి' అనే ఫియర్‌ ఫ్యాక్టర్‌ రియాలిటీ షోకి అక్ష‌య్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి విదిత‌మే.


వీడియో కోసం క్లిక్ చేయండి