Begin typing your search above and press return to search.

రుస్తుం.. బాక్సాఫీస్ కుస్తీ పట్టలేడు

By:  Tupaki Desk   |   13 Aug 2016 4:53 AM GMT
రుస్తుం.. బాక్సాఫీస్ కుస్తీ పట్టలేడు
X
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన రుస్తొం.. ట్రైలర్ రిలీజ్ తర్వాత బాగానే ఆసక్తి కలిగించింది. 57 ఏళ్ల క్రితం దేశంలోనే సంచలనం సృష్టించిన రియల్ మర్డర్ ఇన్సిడెంట్ ను థ్రిల్లర్ టైపులో తీసేందుకు ట్రై చేశాడు దర్శకుడు నీరజ్ పాండే. కానీ రుస్తొం ఏ యాంగిల్ లోనూ ఆడియన్స్ ను మెప్పించలేకపోవడం.. నిరాశ కలిగించే విషయం.

నావల్ ఆఫీసర్ రుస్తొం పర్వీ తన భార్యతో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో తన భార్య(ఇలియానా) మరో వ్యక్తితో బెడ్ పంచుకోవడాన్ని చూస్తాడు. తర్వాత అతన్ని చంపేసే పరిస్థితి. ఈ కేసులో అతను దోషా? నిర్దోషా? ఇదే సినిమా కథ. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఆ మూడు బుల్లెట్లు అంటూ చేసిన ప్రచారం బాగానే ఇంట్రెస్ట్ జనరేట్ చేసినా.. సినిమా ఆస్థాయిలో లేదు. ఈ పీరియాడికల్ మూవీతో ఆడియన్స్ కాదు.. కనీసం ఆయా కేరక్టర్లను పోషించిన యాక్టర్స్ కూడా కనెక్ట్ కాలేదని.. సినిమా చూస్తుంటేనే జనాలకు అర్ధమైపోతుంది.

ప్రతీ వాళ్లు పాఠం అప్పచెప్పినట్లు డైలాగులు చెప్పడమే తప్ప ఎక్కడా ఫీల్ కనిపించలేదు. ఇక భార్య లవర్ ను చనిపోవడానికి కారణం.. అక్రమ సంబంధం కాదు. అతనో స్వార్ధపరుడు - లంచగొండి - దుర్మార్గులతో చెయ్యి కలిపి.. దేశానికి ద్రోహం చేసే డీల్ కుదుర్చుకుంటాడు. ఇలాంటి వాడిని చంపేసిన గన్ ను హీరో హ్యాండిల్ చేసినా.. అతను చంపిన వ్యక్తి కాదు. ఈ లెక్కన అటు దేశానికి ద్రోహం చేసిన.. తన భార్యను వల్లో వేసుకున్న విలన్ ను హీరో ఏం చేయకపోతే.. హీరోయిజం ఎలా ఎలివేట్ అవుతుందో.. జనాలకు ఎలా కనెక్ట్ అవుతుందో ఆలోచించుకోవాల్సిందే.

అక్షయ్ ఎంత గొప్పగా నటించినా.. ఇలియానా ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా.. సెకండాఫ్ అంతా కోర్టులో పెట్టి చూడమంటే.. జనాలకు ఇరిటేషన్ వచ్చేసింది. మొత్తం మీద రుస్తొం ఆడియన్స్ ను బాగానే విసిగించేసింది. ఫైనల్ గా.. టిను సురేష్ దేశాయ్ ఇలాంటి సినిమా తీశాడేంటా అని జనాలు మాట్లాడుకుంటున్నారంటే.. రిజల్ట్ ను ఊహించడం పెద్ద కష్టం కాదు కదా!