Begin typing your search above and press return to search.

తగ్గేదే లేదు.. అక్షయ్ పారితోషికం రూ.135 కోట్లు!

By:  Tupaki Desk   |   29 Dec 2020 9:00 PM IST
తగ్గేదే లేదు.. అక్షయ్ పారితోషికం రూ.135 కోట్లు!
X
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ జోరు ‘అంతకు మించి’ అన్న రేంజ్ లో కొనసాగుతోంది. తనతోపాటు అగ్రనటులుగా ఉన్నవారు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే అవస్థలు పడుతుంటే.. ఈ హీరో మాత్రం ఏకంగా మూడ్నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు. ఇందులోనూ విక్టరీ పర్సెంట్ కూడా ఎక్కువే ఉంటుండడంతో బాక్సాఫీస్ మాగ్నెట్ గా మారిపోయాడు అక్షయ్.

మూవీస్ సెలక్షన్స్ లో అక్షయ్ కుమార్ రూటే సెపరేటు. స్టోరీస్ ఆయన జడ్జ్ చేసే విధానం.. డైరెక్టన్ ఎంచుకునే తీరు మిగిలిన వారికంటే ఆయన్ని ముందు వరసలో నిలబెడతాయి. ఇక ఆన్ స్క్రీన్ తనదైన మార్క్ యాక్టింగ్ తో బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు అక్షయ్. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు సూట్ కేసులు పట్టుకొని వెంట తిరుగుతున్నారు. ఇంకేముంది..? పారితోషికం విషయంలో ఆయన రేటే సెపరేటు అన్నట్టుగా తయారైంది పరిస్థితి.

లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. తన రాబోయే మూవీస్ కు తన రెమ్యునరేషన్ ను రూ.135 కోట్లుగా ఫిక్స్ చేశాడట ఈ బాలీవుడ్ స్టార్. కరోనా నేపథ్యంలో ఓ సినిమాకు రూ.99 కోట్లు తీసుకున్న ఈ నటుడు.. అప్ కమింగ్ మూవీస్ విషయంలో తగ్గేదే లేదంటున్నాడట. అక్షయ్ సినిమా ఎంత ఖర్చు పెట్టినా మినిమం బ్యాక్ రావడం గ్యారెంటీ అనే భరోసా రావడంతో.. ఆయన చెప్పిన రేటుకు సై అంటున్నారట ప్రొడ్యూసర్స్.

లాక్ డౌన్ లో ఒక సినిమాకు రూ.99 కోట్ల నుండి రూ.108 కోట్లు తీసుకున్నాడు అక్షయ్. ఆ తర్వాత ఇటీవల సంతకం చేసిన చిత్రాల కోసం రూ.117 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఇక, 2022లో విడుదల కానున్న చిత్రాల కోసం రూ.135 కోట్లు ఫిక్స్ చేశాడట. అక్షయ్ కు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్.. మార్కెట్ ను బట్టి ఈ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరిస్తున్నారట.

నిజానికి అక్షయ్ కుమార్ చిత్రాల నిర్మాణం కేవలం రూ.35 నుండి 45 కోట్లలోనే ఫినిష్ అయిపోతుందట. ప్రింట్, పబ్లిసిటీ కోసం మరో రూ.15 కోట్లు వేసుకున్నా.. మొత్తం రూ. 50 నుంచి 60 కోట్లలో సినిమా కంప్లీట్ అయిపోతుందట. కానీ.. అక్షయ్ రెమ్యునరేషన్ కలుపుకుంటే మొత్తం బడ్జెట్ రూ.185 నుండి రూ.195 కోట్ల పరిధిలో ఉంటోంది. అయితే.. రాబడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది మరి. అక్షయ్ చిత్రాలకు శాటిలైట్ రైట్స్ నుంచే రూ.80 నుండి రూ.90 కోట్ల వరకు వెనక్కి వచ్చేస్తుందట. అంటే.. సగం రిటర్న్స్ సినిమా విడుదలకు ముందే వచ్చేస్తాయి. ఇక మిగిలిన సగం కలెక్షన్స్ ద్వారా రాబడతారు. సినిమా యావరేజ్ టాక్ తో నడిచినా పెట్టిన కాడికి డబ్బులు వచ్చేస్తాయి. ఇక హిట్ టాక్ వచ్చిందంటే నిర్మాత గల్లాపెట్టె గలగలలాడాల్సిందే. అందుకే నిర్మాతలు అక్షయ్ కు ఎంతైనా ఇవ్వడానికీ రెడీ అవుతున్నారట.

కాగా.. ప్రస్తుతు అక్షయ్ ప్యాకెట్ లో సూర్యవంశి, అట్రాంగి రే, బెల్ బాటమ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, పృథ్వీరాజ్ ఇంకా రామ్ సేతు సినిమాలు ఉన్నాయి. ఈ ఆరు సినిమాల్లో ఈ రెండు మూడు సక్సెస్ అయినా.. అక్షయ్ రెమ్యునరేషన్ గురించి మనం మరోవార్త రాసుకోవచ్చు.