Begin typing your search above and press return to search.

ప్యాడ్ మ్యాన్ కొడితే జ‌నాలు మారిన‌ట్టే

By:  Tupaki Desk   |   7 Feb 2018 5:30 PM GMT
ప్యాడ్ మ్యాన్ కొడితే జ‌నాలు మారిన‌ట్టే
X
సినీ జ‌నాల‌కు ఏం కావాలి? మ‌సాలా ఎలిమెంట్స్ కావాలి, దుమ్ము రేపే మ్యూజిక్ ఉండాలి, ఫైటింగ్ సీన్లు క‌నిపించాలి అప్పుడే వాళ్లే ఏ సినిమాను అయినా హిట్ కొట్టించేది. మ‌రి అలాంటివేమీ లేకుండా సామాజిక స‌మ‌స్య‌లను ఎత్తిచూపే, చైత‌న్యాన్ని తెచ్చే సినిమాల‌ను చూడ‌రా? మ‌రి ప్యాడ్‌మ్యాన్ ప‌రిస్థితేంటీ?

అక్ష‌య్ కుమార్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం ప్యాడ్‌ మ్యాన్‌. త‌మిళ‌నాడుకి చెందిన సామాజిక‌వేత్త అరుణాచ‌లం మురుగ‌నాథం జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఆయ‌న త‌క్కువ ధ‌ర‌కు సానిట‌రీ ప్యాడ్స్ త‌యారుచేయ‌డంతో పాటూ, వాటి వాడుక‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు త‌మిళ‌నాడులో ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అత‌ని పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ న‌టించ‌డం కూడా జీవించేసి న‌ట్టు ట్రైల‌ర్ ద్వారా తెలుస్తోంది. ఒక సినిమాను భార‌త ప్ర‌భుత్వం ప్రమోట్ చేయ‌డం తొలిసారి కావ‌చ్చు. కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిత్వ శాఖ‌... ఈ సినిమా ప్ర‌త్యేక షోను కూడా ఏర్పాటు చేసింది.

మాస్ మ‌సాలా ఎలిమెంట్స్ కోరుకునే సినీ జ‌నాలు ప్యాడ్ మ్యాన్ హిట్ కొట్టిస్తే మాత్రం వారు మారుతున్న‌ట్టే లెక్క‌. ఈ సినిమా ఏమాత్రం ఆడుతుందో చూద్దాం. బాల్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో రాధికా ఆప్టే, సోన‌మ్ కపూర్ లు హీరోయిన్లుగా చేస్తున్నారు. అన్న‌ట్టు ఈ సినిమా మ‌రో రికార్డు కూడా ఇప్ప‌టికే సాధించింది. ఇండియా, ర‌ష్యాలో ఒకేరోజు విడుద‌ల కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 9న రెండు దేశాల్లో సినిమా విడుద‌ల కానున్న‌ట్టు అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.