Begin typing your search above and press return to search.

మళ్లీ బేబీ డైరెక్టర్ తో యాక్షన్‌ హీరో

By:  Tupaki Desk   |   8 Feb 2016 10:12 AM IST
మళ్లీ బేబీ డైరెక్టర్ తో యాక్షన్‌ హీరో
X
రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన సినిమాలు చేయడంలో యాక్షన్‌ హీరో అక్షయ్ కుమార్ కు మించిన హీరో బాలీవుడ్ లో కనిపించడనే చెప్పాలి. ప్రపంచంలోనే అతి పెద్ద మానవ తరలింపుగా రికార్డుల్లోకి ఎక్కిన గల్ఫ్ ప్రజల కష్టాలపై రీసెంట్ గా ఎయిర్ లిఫ్ట్ చేశాడు అక్షయ్ కుమార్. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సక్సెస్ జోష్ లోనే మరో మూవీ కూడా అనౌన్స్ చేశాడు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్.

ఎ వెడ్నెస్ డే - బేబీ - స్పెషల్ 26 వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ నీరజ్ పాండేతో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన బేబి చిత్రానికి ఎన్నో అవార్డులు - రివార్డులు. ఈ మూవీ స్క్రిప్ట్ ను ఆస్కార్ అకాడమీ లైబ్రరీలో ఉంచేందుకు ఎంపిక చేశారంటే.. బేబి ప్రపంచాన్ని ఎంతగా ఆకర్షించిందో అర్ధమవుతుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

రుస్తుం అనే టైటిల్ తో రూపొందనున్న సినిమాని నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ కుమార్ చేయనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన అక్షయ్ కుమార్.. త్వరలో ఇతర నటీనటులను ఎంపిక చేస్తామని చెప్పాడు. ప్రస్తుతం ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ పేరిట.. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీపై ఓ సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు.