Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ జోరు కొనసాగబోతుందా?

By:  Tupaki Desk   |   9 Nov 2020 5:30 PM GMT
సూపర్‌ స్టార్‌ జోరు కొనసాగబోతుందా?
X
గడచిన రెండు మూడు సంవత్సరాలుగా అక్షయ్‌ కుమార్‌ బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద దక్కించుకున్న విజయాలు అన్ని ఇన్నీ కావు. ఆయన ఏడాదికి మూడు నాలుగు సినిమాలను కూడా విడుదల చేసి విజయాలు దక్కించుకున్నాడు. వంద కోట్లు ఆపై వసూళ్లు దక్కించుకున్న సినిమాల సంఖ్య విషయంలో సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నెం.1 స్థానంలో ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం వంద కోట్లు అన్నట్లుగా సాగుతున్న ఈ సమయంలో ఆయన నటించిన సినిమా 'లక్ష్మి' ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. సౌత్‌ లో సూపర్‌ హిట్‌ అయిన కాంచనకు అక్షయ్‌ కుమార్‌ లక్ష్మి రీమేక్‌ అనే విషయం తెల్సిందే. లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నా కూడా కొన్ని ఇప్పట్లో థియేటర్లు పునః ప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు. కనుక ఓటీటీలో విడుదలకు సిద్దం చేశారు. ఈ సినిమా టైటిల్‌ విషయమై వివాదం తలెత్తడంతో బాంబ్‌ పదంను తొలగించి కేవలం లక్ష్మి అంటూ ప్రచారం చేస్తున్నారు. థియేటర్లలో వరుసగా సక్సెస్‌ లు దక్కించుకున్న అక్షయ్‌ కుమార్‌ తన సక్సెస్‌ జర్నీని ఓటీటీలో కూడా కొనసాగిస్తాడా.. మొదటి ఓటీటీ విజయాన్ని అక్షయ్‌ దక్కించుకుంటాడా అనేది చూడాలి.