Begin typing your search above and press return to search.
అందుకోసమే ఆసుపత్రిలో చేరాను!
By: Tupaki Desk | 5 April 2021 2:12 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆదివారం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత నిర్ధారణ కావడంతో వెంటనే హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపాడు అక్షయ్. కానీ ఇటీవలే ఆయన కరోనా కారణంగా క్వారంటైన్ విడిచి ఆసుపత్రిలో చేరాడు. తాజాగా అక్షయ్ ఆరోగ్యం గురించి అప్డేట్ అందించేందుకు ట్విట్టర్ వేదికగా 'తను బాగానే ఉన్నానని' హామీ ఇచ్చాడు. కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యాక ఒకరోజు తర్వాత ఈ బాలీవుడ్ యాక్టర్.. తాను ఆసుపత్రిలో చేరానని ట్విట్టర్ లో తెలిపాడు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపి అభిమానులకు, శ్రేయోభిలాషులకు సమాచారం అందించాడు. అలాగే ఆసుపత్రిలో చేరింది కూడా వైద్యుల సలహా మేరకే అని చెప్పాడు అక్షయ్.
అక్షయ్ గతేడాది లక్ష్మి సినిమా సమయంలో కూడా కోవిడ్ బారినపడి కోలుకున్నాడు. కానీ రెండోసారి కోవిడ్ పాజిటివ్ వచ్చేసరికి కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి టెన్షన్ పడే అవసరం లేదని.. తాను పూర్తిగా స్థిరమైన ఆరోగ్యంతో ఉన్నానని చెప్పాడు అక్షయ్. అలాగే తాజాగా ట్విట్టర్ వేదికగా.. 'నా ఆరోగ్యం గురించి అభిమానులు, సన్నిహితులు ప్రార్థిస్తున్నారని తెలిసింది. నా ఆరోగ్యం కోసం క్షేమం కోరిన వారందరికీ ధన్యవాదాలు. మీ ప్రార్థనల పవర్స్ పని చేస్తున్నాయని అనిపిస్తుంది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కానీ వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరడం జరిగింది. త్వరలోనే ఆరోగ్యంగా ఇంటికి తిరిగివస్తాను. మీరందరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను' అంటూ తెలిపాడు. నిజానికి ఏప్రిల్ 5న అక్షయ్ 'రామ్ సేతు' సినిమా షూటింగ్ లో వందమంది జూనియర్ ఆర్టిస్టులతో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు చిత్రయూనిట్ మొత్తం టెస్ట్స్ చేయించుకున్నారట. అందులో 45 మంది జూనియర్ ఆర్టిస్టులకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.